హైదరాబాద్‌కు 64 దేశాల రాయబారులు, ప్రతినిధులు: స్పెషల్ ఫ్లైట్‌లో: కాస్సేపట్లో: ఎందుకంటే..?
హైదరాబాద్: హైదరాబాద్‌ను సందర్శించడానికి 64 దేశాలకు చెందిన రాయబారులు, ప్రతినిధులు బయలుదేరారు. కొద్దిసేపటి కిందటే వారు దేశ రాజధాని నుంచి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి వ్యాక్సిన్‌ను అభివృద్ఢి చేస్తోన్న భారత్ బయోటెక్‌ను వారు సందర్శించనున్నారు. భారత్ బయోటెక్ సంస్థ యాజమాన్యం, ప్రతినిధులను కలుసుకోనున్నారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంపై అనుసరించిన విధానాలను అడిగి తెలుసుకోనున్నారు.
భారత్ బయోటెక్‌తో పాటు బయోలాజికల్-ఇ లిమిటెడ్‌ను కూడా వారు సందర్శిస్తారు. కొద్దిరోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. భారత్ బయోటెక్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. భారత్ బయోటెక్‌తో పాటు అహ్మదాబాద్‌లోని జైడస్ ఫార్మాసిటీని సందర్శించారు. దీనికి కొనసాగింపుగా 64 దేశాల రాయబారులు, ప్రతినిధులతో కూడిన ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు రానుంది. హైదరాబాద్‌ను సందర్శించిన తరువాత వారు.. పుణే, గుజరాత్‌కు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

ఫార్మాసూటికల్ హబ్‌గా పేరుపొందిన హైదరాబాద్‌లో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, మరింత విస్తరించడానికి గల అవకాశాలపైనా వారు ఆరా తీస్తారని చెబుతున్నారు. హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని దక్షిణాది రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. దాన్ని నిల్వ ఉంచడానికి అవసరమైన వసతులు, మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో ఎంతమేరకు ఉన్నాయనే అంశంపైనా విదేశీ ప్రతినిధులు ఆరా తీయొచ్చని అంటున్నారు.

Recommended Video
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ప్రస్తుతం తుదిదశలో ఉంది. సామాన్య ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను వినియోగంలోనికి తీసుకుని రావడానికి భారత్ బయోటెక్ యాజమాన్యం.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వద్దకు ప్రతిపాదనలను పంపించింది. ఈ పరిస్థితుల్లో ఏకంగా 64 దేశాల ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో రెండు వారాల్లో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications