వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌పై ఒత్తిడి: ఏపీకి చెందిన 650 మంది ఉద్యోగులకు తెలంగాణ షాక్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇప్పటికే పన్నెండు వందల మందికి పైగా ఉద్యోగులను రిలీవ్ చేసిన కెసిఆర్ ప్రభుత్వం తాజాగా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 650 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయులను వెనక్కి పంపేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.

ఏపీకి చెందిన దాదాపు 650 మంది ఉపాధ్యాయులు హైదరాబాద్, సరిహద్దు జిల్లాల్లో పని చేస్తున్నారు. వీరిని ఏపీకి తిప్పి పంపించాలని స్థానిక ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు వస్తున్నాయని అంటున్నారు.

650 AP teachers to be sent back, list with CM KCR

ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలు ఏపీకి చెందిన ఉపాధ్యాయుల జాబితాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అందించారని తెలుస్తోంది. వీరిని 2015-16 అకడమిక్ ఇయర్ తర్వాత రిలీవ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన 1200 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. ఇది కోర్టుకు ఎక్కింది. విద్యుత్ ఉద్యోగులకు రెండు ప్రభుత్వాలు వేతనాలు ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీని వేసిన విషయం తెలిసిందే.

English summary
The Telangana state government is gearing up to repatriate about 650 teachers hailing from Andhra Pradesh working in Hyderabad and surrounding districts under pressure from local teacher union leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X