తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు, సిటీలోనే అత్యధికం: కేటీఆర్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: నగరంలో కరోపా పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కరోనా వ్యాప్థిని నివారించేందుకు కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని, నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

260 కంటైన్మెంట్లు.. అన్ని ఇంటికే..

260 కంటైన్మెంట్లు.. అన్ని ఇంటికే..

రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 260 కంటైన్మెంట్ జోన్లు ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో 146 ఉన్నాయని తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని, పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మందులను, ఇళ్ల వద్దకే సరఫరా చేయాలని ఆదేశించారు. అంతేగాక, ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు, సిబ్బందితో మాత్రమే నిత్యావసరాలను డోర్ డెలివరీ చేయించాలని స్పష్టం చేశారు. వీలైతే వారికి ప్రత్యేక దుస్తులు అందజేయాలన్నారు.

ప్రజల సహకాంతోనే..

ప్రజల సహకాంతోనే..

ఇక కంటైన్మెంట్ జోన్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దాతలను అనుమతించొద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిలేదని, ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్ లోని కుటుంబాల మొబైల్ నెంబర్లతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి అవసరాలను తెలుసుకోవాలన్నారు. ప్రజల సహకారంపైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి స్పష్టం చేశారు. ఇప్పటికి జీహెచ్ఎంసీ పరిధిలో 15 తొలగించామన్నారు. శానిటేషన్, స్ప్రేయింగ్, వైద్య సర్వేలను తగు జాగ్రత్తలతో నిర్వహించాలని సూచించారు.

రెండ్రోజుల్లో 116 కొత్త కేసులు

రెండ్రోజుల్లో 116 కొత్త కేసులు

ఇది ఇలావుండగా, తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 66 కరోనా కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత రెండ్రోజుల్లోనే 116 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా, నమోదైన 66 కేసుల్లో 30 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదుకావడం గమనార్హం.

Recommended Video

    Vijay Devarakonda Video Conference With Telangana Police | Oneindia Telugu
    766కు చేరిన పాజిటివ్ కేసులు

    766కు చేరిన పాజిటివ్ కేసులు

    జిల్లాల వారీగా గమనించినట్లయితే.. సూర్యాపేట జిల్లాలో 15, ఆదిలాబాద్ లో 3, జోగులాంబ గద్వాల, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు తెలిపింది. తాజాగా నమోదైన 66 కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 766కు చేరింది. ఇప్పటి వరకు 186 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 18 మంది మృతి చెందారు. ప్రస్తుతం 562 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+