తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కొత్త కరోనా కేసులు: యాక్టివ్ కేసులు కూడా, జిల్లాల వారీగా కేసులివే

హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది వారాలుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా 1,14,260 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 691 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు, 5 మరణాలు

తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు, 5 మరణాలు

తాజాగా, నమోదైన 691 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,38,721కు చేరింది. కరోనాతో కొత్తగా ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3771కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

తెలంగాణలో 9,908 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 9,908 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 565 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,25,042కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,908 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 97.85 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 23, జీహెచ్ఎంసీలో 85. జగిత్యాలలో 26, జనగామలో 10, జయశంకర్ భూపాలపల్లిలో 09, జోగులాంబ గద్వాలలో 03, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 55, ఖమ్మంలో 56, కొమురంభీం ఆసిఫాబాద్ లో 07, మహబూబ్‌నగర్‌లో 08, మహబూబాబాద్‌లో 19, మంచిర్యాలలో 37, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 30, ములుగులో 09, నాగర్ కర్నూలులో 05, నల్గొండలో 38, నారాయణపేటలో 02, నిర్మల్‌లో 03, నిజామాబాద్‌లో 07, పెద్దపల్లిలో 42, రాజన్న సిరిసిల్లలో 19, రంగారెడ్డిలో 29, సంగారెడ్డిలో 07, సిద్దిపేటలో 18, సూర్యాపేటలో 47, వికారాబాద్ లో 05, వనపర్తిలో 09, వరంగల్ రూరల్ లో 25, వరంగల్ అర్బన్‌లో 41, యాదాద్రి భువనగిరిలో 14 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్క కామారెడ్డి జిల్లాల్లోనే ఒక్క కొత్త కరోనా కేసూ నమోదు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+