తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు, మరణాలు: 10వేలకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కేసులివే
హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో కొత్త కేసులు 700కు దిగువకు వచ్చాయి. మరణాలు కూడా తగ్గాయి. రాష్ట్రంలో 1,05,797 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 696 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 696 కరోనా కేసులు, 6 మరణాలు
తాజాగా, నమోదైన 696 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,32,379కు చేరింది. కరోనాతో కొత్తగా ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3735కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

తెలంగాణలో 10,148 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 858 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,18,496కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,148 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 97.80 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేసిన నాటి నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా కేసులు తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం.
Recommended Video

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 35, జీహెచ్ఎంసీలో 68. జగిత్యాలలో 21, జనగామలో 06, జయశంకర్ భూపాలపల్లిలో 15, జోగులాంబ గద్వాలలో 04, కామారెడ్డిలో 02, కరీంనగర్ లో 45, ఖమ్మంలో 82, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 08, మహబూబాబాద్‌లో 23, మంచిర్యాలలో 19, మెదక్‌లో 04, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 31, ములుగులో 19, నాగర్ కర్నూలులో 04, నల్గొండలో 49, నారాయణపేటలో 03, నిర్మల్‌లో 04, నిజామాబాద్‌లో 07, పెద్దపల్లిలో 48, రాజన్న సిరిసిల్లలో 18, రంగారెడ్డిలో 33, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 24, సూర్యాపేటలో 33, వికారాబాద్ లో 04, వనపర్తిలో 06, వరంగల్ రూరల్ లో 06, వరంగల్ అర్బన్‌లో 48, యాదాద్రి భువనగిరిలో 21 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications