హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాలాలో కొట్టుకుపోయిన 7 ఏళ్ల బాలుడు, ఓల్డ్ మలక్ పేట‌లో విషాదం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగి పొరలుతున్నాయి. ఈ క్రమంలో ఓల్డ్ మలక్ పేటలోని శంకర్ నగర్‌లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.

7 ఏళ్ల బాలుడు తరుణ్ ప్రమాదవశాత్తు మూసినదిలో పడిపోయి గల్లంతయ్యాడు. బాలుడు నీటి ప్రవాహంలో పడటంతోనే ప్రమాదాన్ని గ్రహించిన స్ధానికులు పరుగులు తీసినా బాలుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

బాలుడి కుటుంబ సభ్యులు చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్ధానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ ఎంసి అధికారులు, స్థానికులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

7 Years old boy missing in Musi River in Hyderabad

స్ధానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ ఎంసి అధికారులు, స్థానికులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రైల్లోంచి కిందపడి తెలంగాణకు చెందిన విద్యుత్‌ ఉద్యోగి మృతి

హైదరాబాద్‌కు చెందిన విద్యుత్‌శాఖ ఉద్యోగి సత్యనారాయణ(40) రైల్లో నుంచి కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి జీఆర్పీ పరిధిలోని రామరాజుపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లో ట్రాన్స్‌కో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా సత్యనారాయణ విధులు నిర్వర్తించేవాడు. తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు వస్తూ రామరాజుపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే తలుపువద్ద నిలబడ్డాడు.

రైలు వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వద్ద ఉన్న ఆధారాల మేరకు కుటుంబ సభ్యలకు సమాచారం అందించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

English summary
7 Years old boy missing in Musi River in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X