తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు: 10వేలకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కేసులివే
హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో కొత్త కేసులు 700కుపైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో 1,13,069 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 715 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 715 కరోనా కేసులు, 4 మరణాలు
తాజాగా, నమోదైన 715 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,35,320కు చేరింది. కరోనాతో కొత్తగా నలుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3751కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

తెలంగాణలో 10,028కి పెరిగిన యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 784 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,21,541కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,028 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 97.83 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 02, భద్రాద్రి కొత్తగూడెంలో 39, జీహెచ్ఎంసీలో 76. జగిత్యాలలో 25, జనగామలో 09, జయశంకర్ భూపాలపల్లిలో 13, జోగులాంబ గద్వాలలో 06, కామారెడ్డిలో 04, కరీంనగర్‌లో 52, ఖమ్మంలో 68, కొమురంభీం ఆసిఫాబాద్ లో 04, మహబూబ్‌నగర్‌లో 05, మహబూబాబాద్‌లో 17, మంచిర్యాలలో 45, మెదక్‌లో 04, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 27, ములుగులో 12, నాగర్ కర్నూలులో 06, నల్గొండలో 54, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 03, నిజామాబాద్‌లో 10, పెద్దపల్లిలో 41, రాజన్న సిరిసిల్లలో 18, రంగారెడ్డిలో 31, సంగారెడ్డిలో 07, సిద్దిపేటలో 21, సూర్యాపేటలో 29, వికారాబాద్ లో 02, వనపర్తిలో 07, వరంగల్ రూరల్ లో 13, వరంగల్ అర్బన్‌లో 49, యాదాద్రి భువనగిరిలో 16 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

ఆ జిల్లాలో వరుసగా రెండో రోజూ ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు
కాగా, నారాయణ్‌పేట్ వరుసగా రెండో రోజు కూడా ఒక్క కరోనా కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రుల్లో కరోనా రోగుల సంఖ్య పెరుగుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నప్పటికీ కొందరు ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మరోసారి కరోనా కేసులు పెరిగే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications