కశ్మీర్ లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ బిడ్డలు.. కాపాడాలని బోరున ఏడుస్తూ
జమ్ముకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన ఘాతుకానికి 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీంతో కాశ్మీర్ లోని అందాలను తనివితీరా చూసి ఆస్వాదించాలని వెళ్లిన 80 మంది తెలంగాణ పర్యాటకులు ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకు బిక్కుబిక్కుమంటూ ఓ హోటల్ లో తలదాచుకున్నారు. తమని రక్షించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల దాడి దృష్ట్యా కాశ్మీర్ పర్యటనలో ఉన్న దాదాపు 80 మంది తెలంగాణ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ శ్రీనగర్‌లోని హోటల్‌లో 80 మంది తెలంగాణ పర్యాటకులు తలదాచుకున్నారు. తమను స్వస్థలాలకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ భాయానక వాతావరణం నెలకుందని.. బయటకు వెళ్తామంటే భయంగా ఉందని తమను సొంతూళ్లకు పంపే ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.
వేసవి సెలవులు కావడంతో వీళ్లంతా జమ్మూ కశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో విహరించేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కాశ్మీర్ వెళ్లారు. ఓవైపు భద్రతా దళాలు భరోసా ఇస్తున్నా వీరు మాత్రం ఆందోళనలో ఉన్నారు. ఉగ్రదాడితో కర్ఫ్యూ విధింపుతో వీరంతా హోటల్‌లోనే ఉండిపోయారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం వీరంతా పహల్గాం పర్యటనకు వెళ్లాల్సి ఉంది. తిరిగి ఈనెల 26న టూర్ ముగించుకుని స్వస్థలాలకు రావాలని ప్లాన్ చేసుకున్నారు. ఉగ్రమూకల దాడితో పర్యాటకులందరూ శ్రీనగర్‌లోనే ఉండిపోయారు. వీరిలో హైదరాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్,నల్గొండ జిల్లా వాసులు అధికంగా ఉన్నారు. తమను వీలైనంత త్వరగా సొంతూళ్లకు పంపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరోవైపు ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో హైదరాబాద్ కోఠిలోని ఎస్‌ఐబీ కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మనీశ్‌రంజన్ మృతిచెందారు. ఐడీ కార్డ్ చూసిన అనంతరం భార్య, ఇద్దరు పిల్లల ముందే ఆయన్ని కాల్చిచంపారు. తమ కళ్ల ముందే తండ్రిని కోల్పోవడం చూసి ఆ పిల్లలు బోరును విలపించారు.












Click it and Unblock the Notifications