80వేల ఉద్యోగాల భర్తీ, 100 నియోజకవర్గాల్లో దళిత బంధు: 3 ఎకరాల ఇస్తామనలేదని కేసీఆర్ క్లారిటీ
జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చాలా పోరాటం చేశామన్నారు కేసీఆర్. జోనల్ విధానం అమలైతే ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై వివరణాత్మకంగా మాట్లాడిన సీఎం.. ఈ సందర్భంగా నిరుద్యోగులకు ఈ శుభవార్త చెప్పారు. వచ్చే 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఇప్పటికే 1.35లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. జోన్ల ఆమోదం కోసం పంపితే విపరీతమైన జాప్యం జరిగింది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిబంధన పెట్టాం.హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండు, మూడు నెలల్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దాదాపు 70వేల-80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందని వెల్లడించారు. దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు.

వచ్చే 3 నెలల్లో 80వేల ఉద్యోగాల భర్తీ: కేసీఆర్
జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చాలా పోరాటం చేశామన్నారు కేసీఆర్. జోనల్ విధానం అమలైతే ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై వివరణాత్మకంగా మాట్లాడిన సీఎం.. ఈ సందర్భంగా నిరుద్యోగులకు ఈ శుభవార్త చెప్పారు. వచ్చే 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇప్పటికే 1.35లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. జోన్ల ఆమోదం కోసం పంపితే విపరీతమైన జాప్యం జరిగింది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిబంధన పెట్టాం. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతాం. జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉటుంది. కొత్త జిల్లాల ప్రకారం నవోదయ పాఠశాలలు అడిగితే ఇవ్వట్లేదు. బీజేపీ ఎంపీలు నవోదయ పాఠశాలలు మంజూరు చేయించాలని సీఎం కేసీఆర్ అన్నారు.

మార్చి నాటికి 100 నియోజకవర్గాల్లో దళితబంధు
దళితబంధు అమలుపైనా కేసీఆర్ స్పందించారు. దళితబంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదని.. 1986లోనే ఈ పథకం పురుడుపోసుకుందని కేసీఆర్ స్పష్టం చేశారు. దళితబంధుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. స్వాతంత్య్రానికి ముందు కూడా హింసకు గురయ్యారన్నారు. అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇప్పటివరకు కొంతమేర చేయగలిగామని కేసీఆర్ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ను ఇందిరా గాంధీ కాలంలో ఏర్పాటు చేశారని... ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం పొంది బాగుపడిన వారు కనిపించలేదన్నారు కేసీఆర్. వచ్చే ఏడాది మార్చి లోపు 100 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ పథకం అమలుకు ఇప్పుడు దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేశాం. రూ.10 లక్షలతో ఎక్కడైనా, ఎన్ని వ్యాపారాలైనా చేసుకోవచ్చు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం చేయదు. లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టొచ్చు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే బడ్జెట్ నిధులతో నియోజకవర్గానికి 2వేల మందికి దళిత బంధు అందజేస్తాం. దళితుల కోసం ఒక్కో నియోజకవర్గంలో రూ.4వేల కోట్లతో రక్షణ నిధి కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైనా జరిగి కుటుంబం నష్టపోతే రక్షణనిధితో ఆదుకుంటాం. ఒక్క హుజూరాబాద్ ఎన్నిక కోసం అబద్ధాలు అడతామా? సందేహం లేదు.. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. దళిత బంధు నిధులు మళ్లీ చెల్లించాల్సిన పనిలేదు. రాష్ట్రమంతా ఖర్చు చేస్తే రూ.1.80 లక్షల కోట్లు అవసరం అవుతుందని సీఎం కేసీఆర్ వివరించారు. .

కేంద్రాన్ని శాసించే స్థాయికి టీఆర్ఎస్ రావొచ్చన్న కేసీఆర్
ప్రభుత్వ లైసెన్సు అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు దళితబంధు ఇచ్చాం. ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఈ పథకం వర్తింపజేస్తాం. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తాం. ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. దళితబంధుతో ముడిపెట్టం. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులు ఎంపిక ఉంటుంది. ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్ మినహా ప్రతి జిల్లాలో దాదాపు 20 శాతం ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో సగటున 17.53 శాతం ఎస్సీల జనాభా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ పెంచాలి. కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందే. ఇందుకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎన్నోసార్లు తీర్మానం చేసి పంపించాం. ఎన్ని తీర్మానాలు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్ పార్టీకి రావొచ్చు. కేంద్రంలో టీఆర్ఎస్‌కు పాత్ర దొరికే అవకాశం కావచ్చు. ప్రధానికి మూరెడు కాకుంటే బారెడు దరఖాస్తులు ఇస్తాం. కేంద్ర సహకరిస్తే ఇంకా బలంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు కేసీఆర్.
Recommended Video

దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పలేదంటూ కేసీఆర్
దళితులకు 3ఎకరాల భూమి ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. దళిబంధు పథకంపై స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం మాట్లాడారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని చెప్పాను. దళితులకు ఎకరం ఉంటే రెండు ఎకరాలు కొనిస్తామని చెప్పాం. ఒకటిన్నర ఎకరం ఉంటే మరో ఒకటిన్నర ఇస్తామన్నాం. కరోనా కష్టకాలంలో న్యాయవాదులకు రూ.25 కోట్లు ఇచ్చాం. ప్రైవేటు టీచర్లకు బియ్యం, నగదు ఇచ్చి ఆదుకున్నాం. న్యాయవాదులకు డబ్బు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications