కరోనా అప్‌డేట్ : తెలంగాణలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు.. మరో నలుగురి మృతి...

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో 500 మార్క్‌కి కాస్త అటు ఇటుగా నమోదవుతూ వచ్చిన కేసులు.. ఇప్పుడు వెయ్యి మార్క్‌కి చేరువవుతుండటం గమనార్హం. తాజాగా మరో నలుగురు కరోనాతో మృతి చెందారు. మరో 1370 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (మార్చి 30) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,776కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1701కి చేరింది. ప్రస్తుతం 5511 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 2166 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 337 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,01,564కి చేరింది.

 887 new coronavirus cases and 4 deaths reported in telangana

ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.3శాతం ఉండగా... తెలంగాణలో 0.55శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 93.9శాతం ఉండగా తెలంగాణలో 97.66 శాతం ఉంది. తాజాగా అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 201 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,02,10,906 కరోనా టెస్టులు నిర్వహించారు.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 72,330 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,221,665కు చేరింది. కరోనాతో మృతి చెందినవారి సంఖ్య సంఖ్య 1,62,960కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,84,055 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కాగా, దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురువారం(ఏప్రిల్ 1) నుంచి ప్రారంభం కానుంది. మూడో దశలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది జనవరిలో దేశంలో మొదటి దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి విడతలో హెల్త్‌కేర్‌ వర్కర్స్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇస్తున్నారు. తాజాగా మూడో దశలో 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేనివారికి కూడా టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం సమీప వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లవచ్చు. లేదా కోవిన్‌ పోర్టల్‌లో రిజస్టర్‌ చేసుకోవచ్చు. ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా కూడా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులు,క్లినిక్స్‌లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక డోసుకు రూ.250 చార్జి చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+