తెలంగాణలో కరోనా కల్లోలం: 10వేలు దాటిన కేసులు, మరో ఐదు మరణాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదమయ్యాయి. బుధవారం ఒక్కరోజే 891 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసులో ఇదే అత్యధికం కావడం గమనానర్హం.

10వేలు దాటిన కేసులు

10వేలు దాటిన కేసులు

బుధవారం మొత్తం 4069 నమూనాలు పరీక్షించగా.. 891 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,444కి చేరింది. కొత్తగా 137 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4361కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 5858 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరో ఐదు మరణాలు

మరో ఐదు మరణాలు

రాష్ట్రంలో కొత్తగా ఐదు మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 225కు చేరింది. కాగా, తాజా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 719 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కేసులు..

జిల్లాల వారీగా కేసులు..

ఇక రంగారెడ్డి జిల్లాలో 2, వరంగల్ రూరల్ 3, ఖమ్మంలో 4, భద్రాద్రిలో 6, వరంగల్ అర్బన్ 3, కరీంనగర్‌లో 2, నల్గొండ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి,సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 67,318కి చేరింది.

Recommended Video

    కొంపముంచిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌.. టెన్నిస్ స్టార్ Novak Djokovic కు Corona!
    దేశంలో 5 లక్షలకు చేరువలో కేసులు

    దేశంలో 5 లక్షలకు చేరువలో కేసులు


    ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,71,549కు చేరాయి. యాక్టివ్ కేసులు 1,86,364 ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2,70,246 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,884 మంది కరోనా బారినపడి మరణించారు. దేశంలో కొత్తగా 15,432 కొత్త కేసులు నమోదు కాగా, 401 మరణాలు సంభవించాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+