Loksabha Election 2024: ఉదయం 9 గంటలకు 9.48 శాతం పోలింగ్ నమోదు..
తెలంగాణకు సంబంధించి లోక్ సభ ఎన్నికల్లో తొలి రెండు గంటల్లో 9.48 శాతం పోలింగ్ నమోదయింది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 13.2శాతం, జహీరాబాద్ 12.8 శాతం, నల్గొండ 12.8 శాతం పోలింగ్ నమోదైంది. హీరో నరేశ్ నానక్‌రామ్‌గూడాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చేవెళ్లలోని గొల్లపల్లిలో ఓటు హక్కును బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటు వేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు అధికారులు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక చీకటి గదుల్లో పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి కురిసిన వర్షం, గాలులకు విద్యుత్ నిలిచిపోయిందని అధికారులు వివరించారు.
కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం జగన్నాథపూర్‌లో గ్రామస్థులు ఊరికి రోడ్డు వేయాలని లేకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు . రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలో 17 ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. అటు ఏపీలో 9.51 శాతం ఓటింగ్ నమోదయింది.













Click it and Unblock the Notifications