ఆ బావిలో 9 శవాలు.. వరంగల్ లో వలస విషాదం ... వలస కార్మిక మరణాల మిస్టరీ ఏంటి ?
వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో చోటుచేసుకున్న విషాదం అందరినీ షాక్ కు గురి చేస్తుంది . ఇప్పటి వరకు బావిలో 9 మంది శవాలు వెలికితీశారు. స్థానికంగా ఈ ఘటన షాక్ కు గురి చేసింది. అసలు ఈ తొమ్మిది మంది మరణానికి గల కారణాలేమిటి ? వలస కార్మికులు కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో స్వస్థలాలకు వెళ్ళలేక సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారా ? లేకా ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

బావిలో కలిసిపోయిన 9 మంది వలస జీవుల ప్రాణాలు
సుప్రియ కోల్డ్ స్టోరేజ్ సమీపానగల ఒక బావిలో వలస కార్మికులు విగతజీవులుగా తేలారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురితో పాటు, మరో ఇద్దరి మృతదేహాలు ఈరోజు ఇప్పటివరకు వెలికితీశారు. నిన్న రాత్రి వెలికితీసిన ఒకే కుటుంబానికి చెందిన మృతుల్లో భార్య భర్తలు, వారి కుమార్తె, మనవడు ఉన్నట్లుగా గుర్తించారు. ఈరోజు తెల్లవారుజామున అదే కుటుంబానికి చెందిన మరొక మృతదేహం లభ్యమైంది.ఇక ఆ తరువాత వరుసగా మృతదేహాలు బయట పడుతూ వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 9 మంది బావిలో శవాలుగా తేలారు. ఇక ఈ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు .

బావిలో 9 శవాలు హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా?
వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటపడ్డాయి.నిన్న నాలుగు మృతదేహాలు, ఇవాళ మరో 5 మృతదేహాలు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు, వారితో పాటు మరో ఇద్దరి శవాలు బావిలో ఉండటంతో హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక గోదాం ఆవరణలో బావిలో 9 వలస జీవుల శవాలు..ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
ఇక గోదాం ఆవరణలో కార్మికులు లేకపోవటంతో గుర్తించిన నిర్వాహకులు బావిలో శవాలుగా తేలిన వారిని చూసి గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. వరంగల్ నగరపాలక సంస్థ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికి తీశారు.
ఇక ఇప్పటివరకు మృతి చెందిన వారి వివరాలు చూస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మక్సూద్ , అతని భార్య నిషా, కుమార్తె బూస్రా, మూడు సంవత్సరాల వయసున్న బూస్రా కొడుకు , మక్సూద్ ఇద్దరు కొడుకులు షాబాద్ ఆలం, సోహెల్ ఆలం , షకీల్ గా గుర్తించారు. ఇక వీరితోపాటు బీహార కు చెందిన .శ్రీరాం, శ్యాం లుగా గుర్తించారు.
Recommended Video

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ రవీందర్ .. దర్యాప్తు వేగం
మొత్తం ఒకే కుటుంబానికి సంబంధించిన ఏడుగురు, అలాగే బీహార్ కు చెందిన ఇద్దరు గీసుగొండ మండల పరిధిలోని గొర్రెకుంట ప్రగతి ఇండస్ట్రియల్ ఏరియాలో పని చేస్తున్నారు.ఇక వీరి మృతికి గల కారణాలు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . మొదట బీహార్ యువకులను అనుమానించిన పోలీసులకు వారి మృత దేహాలు కూడా లభ్యం కావటంతో ఈ కేసు పెద్ద చిక్కుముడిలా తయారైంది. ఇక సంఘటనా స్థలాన్ని వరంగల్ నగర పోలీస్ కమీషనర్ డా . రవీందర్ పరిశీలించారు. గొర్రెకుంటలోని సంఘటనా స్థలానికి వెళ్ళిన ఆయన అధికారులను , గోదాం యజమానిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.మొత్తం 9 మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఇక ఈ కేసులో అసలు మరణానికి కారణాలు ఏమి ఉంటాయా అన్న కోణంలో దరాప్తు సాగుతుంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications