సెకనుకు రెండు బిర్యానీలు- నిమిషానికి 9 వేల ఆర్డర్లు : న్యూ ఇయర్ ఫుడ్ డెలివరీ రికార్డు..!!

న్యూ ఇయర్ సెల్రబేషన్స్ వేళ..మద్యం రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. రెండేళ్ల పాటు కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉండటంతో..ఈ సారి సెలబ్రేషన్స్ కు ప్రాధాన్యత కనిపించింది. అందులో భాగంగా..మద్యం బాబులు లిక్కర్ తో ఎంజాయ్ చేస్తే.. ఫుడ్‌ లవర్స్‌ తమకునచ్చిన డిషెస్‌ను లాగించేసారు. డిసెంబరు 31 అర్ధరాత్రి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరి యాప్స్‌లో బుక్‌ అయిన ఆర్డర్స్‌ కొత్త రికార్డులను క్రియేట్ చేసాయి. న్యూఇయర్‌ జోష్‌లో భాగంగా స్విగ్గీలో ఏకంగా నిమిషానికి 9500 ఆర్డర్లు రాగా.. రెండో స్థానంలో 7100 ఆర్డర్లతో జొమాటో నిలిచింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ఫుడ్‌డెలివరీలు జరిగాయి. 2021 కొత్త ఏడాది వేడుకల్లో 5500 ఆర్డర్లు డెలివరీ చేసిన స్విగ్గీ ఈ ఏడాది పాత రికార్డును దాటేసింది. ఇక కొత్తేడాది ఫుడ్‌ డెలివరీల్లో బెగంళూరులో మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్‌ రెండో స్థానం దక్కించుకుంది. కరోనా నేపథ్యంలో జనాలు ఎక్కువగా హోటళ్లకు నేరుగా వెళ్లడానికి ఆసక్తి చూపించకపోవడంలో వల్లే ఆన్‌లైన్‌ ఆర్డర్లు భారీగా పెరిగిపోయాయి. ఈ స్థాయిలో చేసిన ఆర్దర్ల ప్రభావం యూపీఐ చెల్లింపులపైనా పడింది.

9 thousand online food orders per minute :created new record on 31st december night

చాలామందికి ఈ ఫుడ్‌ ఆర్డర్లకే కాదు.. పెట్రోల్‌ బంకుల్లో సైతం యూపీఐ చెల్లింపులు విఫలమయ్యాయి. ఫుడ్‌ డెలివరీ యాప్‌లపై హైదరాబాద్‌లో బిర్యానీలకే అధిక డిమాండ్‌ కనిపించింది. స్విగ్గీ గణాంకాల ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా సెకనుకు దాదాపు రెండు బిర్యానీలు (1.9 బిర్యానీలు) ఆర్డర్‌ చేస్తే ఈసారి అది 3 బిర్యానీలకు చేరువైందని అధ్యయనాలు చెబుతున్నాయి.

తాము దేశవ్యాప్తంగా 20 లక్షల ఆర్డర్లను చేశామని, దీని విలువ రూ.91 కోట్లు ఉంటుందని జొమాటో సీఈవో దీపీందర్‌ గోయల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. 2021 ఏడాదికి సంబంధించి కొద్ది రోజుల క్రితం స్విగ్గీ మొత్తంగా ఏ ఫుడ్ అయిటమ్స్ కు ఎంత డిమాండ్ ఉందనే వివరాలను వెల్లడించారు. బిర్యానీలు.. సమోసాలతో పాటుగా.. ఆర్గానిక్ ఫుడ్ కు ఆర్డర్లు భారీగా వస్తున్నట్లుగా బయట పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+