ప్రాణాలతో చెలగాటం, నిబంధనలకు విరుద్దంగా మందుల విక్రయాలు

Subscribe to Oneindia Telugu

కరీంనగర్:జిల్లాలో ఔషధ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. అమ్మకాల్లోనే కాదు.. నిబంధనల విషయంలో దుకాణాల యజమానులు ఆడిందే ఆటగా కొనసాగుతోంది. పలు చోట్ల కాలం చెల్లిన మందులను సైతం అమ్ముతున్నారు.

ప్రాణాలను నిలిపే మందుల బిళ్లలపై ఎటువంటి తయారీ తేదీ, కంపెనీ పేరు ఉండడం లేదు.. అలాగే నూతనంగా పుట్టుకొస్తున్న కంపెనీలు తమ తమ నమూనా మందులను ఉచితంగా దుకాణాలకు అందజేస్తున్నారు. అలాంటి మందులను సైతం దుకాణదారులు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యజమానులు మరో అడుగు ముందుకేసి ఫార్మసిస్టు లేకుండానే ఔషధాలను విక్రయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

91 cases booked against medical shops in past 7 months in karimnagar district

ప్రస్తుతం జిల్లాలో 1,500 ఔషధ దుకాణాలున్నాయి.గత జనవరి నుంచి జులై వరకు ఏడు నెలల కాలంలో అధికారులు జరిపిన తనిఖీల్లో భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. 433 దుకాణాలు తనిఖీ చేయగా రెండు ప్రధాన లోపాలు బహిర్గతమయ్యాయి. 91 చోట్ల ఫార్మసిస్టు లేకుండానే మందులు అమ్ముతుండగా కేసులు నమోదు చేశారు. 33దుకాణాల్లో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నట్టు తేలింది. మరికొన్ని చోట్ల శాంపిల్‌ మందులను అమ్ముతున్నారు.జిల్లాలో తొంబై శాతం మందుల దుకాణాల్లో ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువ ధరలకు ఔషధాలను విక్రయిస్తున్నారు.

కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో మార్చి 9న తనిఖీలు జరిపిన అధికారులు లైసెన్సు లేకుండా మందులు అమ్ముతున్న ఒక దుకాణ యజమానిపై సెక్షన్‌ 18(సీ) ప్రకారం కేసు నమోదు చేశారు. నందిపేట్‌ మండల కేంద్రంలో ఒక ప్రముఖ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు మోనోహెల్త్‌ సిరప్‌ లేబుల్‌పై తయారీ సంస్థ లేబుల్‌ లేనందున చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. భీమ్‌గల్‌ బస్టాండ్‌ ఆవరణలోని ఓ దుకాణంపై దాడి చేసి నిబంధనలు ఉల్లంఘించిన యజమానిపై కేసు నమోదు చేశారు. ఆర్మూర్‌ డివిజన్‌లోని కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్‌, భీమ్‌గల్‌, ఆర్మూర్‌ మండలాల్లో నింబంధనలు ఉల్లఘించిన 49 దుకాణాలపై కేసులు నమోదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Drug inspector raided many medical shops in Karimnagar district. Drug inspector booked 91 cases in past seven months against medical shops

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి