ఉప్పు ధరల వెనుక ఇంత భారీ కుట్ర! : అందినంత దోచుకోవడానికి స్కెచ్!
హైదరాబాద్ : కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనం మూటలు బయటపడ్డమేమో గానీ.. ఇదే అదునుగా భావించి అందినకాడికి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కొంతమంది వ్యాపారులు. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి.. రేటును అమాంతం చుక్కలనింటిస్తున్నారు. కొత్త నోట్ల రద్దు తర్వాత దేశంలో ఉప్పు రేట్లు భారీగా పెరిగిపోతున్నాయంటూ వదంతులు రేగడానికి ఇదే ప్రధాన కారణం.
తొలుత ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసిన ఈ ఉప్పు కొరతను.. ఆయా రాష్ట్రాల్లో కొంతమంది వ్యాపారులు దీన్నో అవకాశంగా మలుచుకోవాలని భావించారు. అందులో భాగంగానే మార్కెట్లో ఉన్న వస్తువులను గోడౌన్లలో దాచిపెట్టి.. కృత్రిమ కొరత స్రుష్టించాలనుకున్నారు. ఈ లేని కొరతకు ప్రచారం కల్పించేందుకు గాను సోషల్ మీడియాను విపరీతంగా వాడుకోవడంతో.. ఉప్పు రేట్లు అమాంతం పెరిగాయంటూ జనాల్లో వదంతులు రేగం విపరీతంగా పెరిగిపోయింది.

దీంతో రూ.18కు విక్రయించాల్సిన ఒక్కో ఉప్పు ప్యాకెట్ ను రూ.200లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు కొంతమంది వ్యాపారస్తులు. కిరాణా దుకాణాల నుంచి ఉప్పు ప్యాకెట్లను కొనుగోలు చేసిన కొంతమంది దళారులు.. బహిరంగా మార్కెట్లో రెట్టింపు ధరకు అమ్మి జేబులు నింపుకున్నారు. ఒక్క ఉప్పు మాత్రమే కాదు సామాన్యుడి వంటింటికి అవసరమైన ఉప్పు, పప్పు, ఉల్లి, ఇలా ప్రతిదాన్ని కృత్రిమ కొరతంగా మార్చేయాలన్న భారీ కుట్ర దీని వెనుక దాగి ఉన్నట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్ పరిధిలోను ఉప్పు రేట్లు చుక్కలనంటాయని వార్తలు రావడంతో.. జనం ఆందోళనకు గురయ్యారు. దీంతో విషయంపై ఆరా తీసిన పోలీసులు.. ఇదంతా వట్టి పుకారుగా తేల్చేయడం గమనార్హం. కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ రేటుకు ఉప్పును విక్రయిస్తున్న కొంతమంది వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారిస్తున్న పోలీసులు.. ఈ మొత్తం తతంగానికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications