ఎందుకిలా?: 11ఏళ్ల బాలుడిపై 16ఏళ్ల యువకుడు రేప్, దారుణ హత్య

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ బార్కాస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 12ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు 16ఏళ్ల యువకుడు.

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ బార్కాస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు.. ఈ విషయం బయటికి తెలుస్తుందనే భయంతో అతడ్ని దారుణంగా హత్య చేశాడు. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 12ఏళ్ల తమ కుమారుడు కనిపించడం లేదంటూ బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం వాల్ పోస్టర్లను కూడా నగరంలో పలు ప్రాంతాల్లో అంటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

A boy raped and murdered by a youth

బాలుడు చదువుతున్న పాఠశాల సీసీఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపడంతో నిందితుడి ఆచూకీ లభ్యమైంది. నిందితుడ్ని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం అంగీకరించాడు. చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చిన బాలుడిపై అత్యాచారానికి పాల్పడినట్లు 16ఏళ్ల నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు.

ఆ తర్వాత ఈ విషయం బయటికి తెలుస్తుందనే భయంతో బాలుడిని గోడకేసి బాది, రాడ్డుతో కొట్టిచంపినట్లు నిందిత యువకుడు చెప్పాడు. అనంతరం పాఠశాల వాటర్ పక్కనే బాలుడి మృతదేహాన్ని దాచినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా బాలుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది.

తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న బాలుడి తల్లిదండ్రులు విషయం తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు తెలిసిందని చెప్పారు. నిందితుడు ఇప్పటి వరకు 16మందిపై ఈ దారుణాన్ని కొనసాగించాడని పోలీసులు చెప్పారు. నిందితుడికిది అలవాటుగా మారిందని చెప్పారు.

తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, ఇంటర్నెట్‌లో లభిస్తున్న అశ్లీలం యువతను చెడుమార్గంలోకి తీసుకెళుతున్నాయని, వారిలో క్రూరత్వాన్ని పెంచుతున్నాయని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. ఇలాంటి కేసుల్లో నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+