కూల్ డ్రింక్ అనుకుని పురుగులమందు తాగిన చిన్నారి.. ఆస్పత్రికి తరలిస్తుండగానే అనంతలోకాలకు!!

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అజాగ్రత్తగా వ్యవహరించకూడదని పదేపదే చెబుతూ ఉంటారు. అలా అజాగ్రత్తతో వ్యవహరిస్తే ఒక్కొక్కసారి పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరిస్తుంటారు. అటువంటి అజాగ్రత్తనే ఒక పసికందు ఉసురు తీసింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని భీంపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే

 కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన ఐదేళ్ళ చిన్నారి

కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన ఐదేళ్ళ చిన్నారి

కొమరం భీమ్ ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన రాజేష్ లావణ్య దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె శాన్వి ఉన్నారు. ఐదు సంవత్సరాలు వయసు ఉన్న కుమార్తె శాన్వి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతుంది. అయితే నిన్న ఆదివారం కావడంతో శాన్వి ఇంటి దగ్గర ఆడుకుంటున్న క్రమంలో, ఇంటి ఆవరణలో ఉన్న ఒక బాటిల్ ను కూల్ డ్రింక్ అనుకుని తాగేసింది. పంట చేనుకు పురుగుల మందు కొట్టడానికి, ఇంటికి తెచ్చి పెట్టిన పురుగుమందుల బాటిల్ ను శాన్వి కూల్ డ్రింక్ అనుకొని తాగేసింది.

ఆస్పత్రికి వెళ్ళే లోపే చిన్నారి మృతి

ఆస్పత్రికి వెళ్ళే లోపే చిన్నారి మృతి

ఆ తరువాత శాన్వి కి వాంతులు కావడం మొదలైంది. దీంతో గమనించిన తల్లిదండ్రులు పాప కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు త్రాగిందని గుర్తించి ఆసుపత్రికి పరుగులు పెట్టారు. అయితే అప్పటికే శాన్వి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పటి వరకూ కళ్లముందే సంతోషంగా ఆడుకున్న తమ బిడ్డ, తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా దుఃఖించారు. చిన్నారి శాన్వి మృతితో భీంపూర్ గ్రామంలోని విషాదఛాయలు అలముకున్నాయి.

చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళలో జాగ్రత్త

చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళలో జాగ్రత్త

చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో, వ్యవసాయం చేసే రైతులు పురుగుమందులు వారికి అందకుండా జాగ్రత్తగా పెట్టాలని పెద్దలు సూచిస్తున్నారు. వారి ప్రాణాల మీదకు తెచ్చే వేటినీ వారికి దగ్గరగా ఉంచకూడదని సూచిస్తున్నారు. ఇక పురుగుమందులైతే మరీ జాగ్రత్త అంటున్నారు. తెలిసీ తెలియని వయసులో ఉన్న పిల్లలు అవి కూల్ డ్రింక్స్ అనుకుని తాగే ప్రమాదం ఉంటుందని, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంతో లాభం ఉండదని చెబుతున్నారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే తీరని నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+