కేసీఆర్ పర్యటనలో అపశృతి: కాన్వాయ్ వాహనం ఢీకొని పీసీకి తీవ్రగాయాలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రంగారెడ్డి జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్‌ శుక్రవారం జిల్లాలోని కొత్తూరు మండలంలో ఉన్న జహంగీర్‌పీర్‌ దర్గాను దర్శించుకోవడానికి బయలుదేరారు.

ఈ సమయంలో సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌లోని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వాహనం ఢీకొని ఓ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బాధిత కానిస్టేబుల్‌ను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

A constable injured after cm kcr convoy hits him

గాయపడిన కానిస్టేబుల్‌ కీసర పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న రవి కిరణ్‌గా గుర్తించినట్లు సమాచారం. కాగా, జహంగీర్‌పీర్‌ దర్గాను దర్శించిన ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మొక్కు చెల్లించుకున్నారు.

A constable injured after cm kcr convoy hits him

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దర్గాను సందర్శించి, మొక్కు చెల్లించుకుంటానని గతంలో కేసీఆర్ మొక్కుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జహంగీర్‌ పీర్‌ దర్గాను సందర్శించి మొక్కులు చెల్లించుకుని, చాదర్‌ను సమర్పించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A constable injured after Telangana CM K Chandrasekhar Rao's convoy hits him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి