కారు ప్రమాదం: టెక్కీ దంపతుల మృతి
నిజామాబాద్: జిల్లాలోని డిచ్‌పల్లి మండలం చాంద్రాయనపల్లిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని గుమ్మిలేరుకు చెందిన దంపతులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గుమ్మిలేరుకు చెందిన రెడ్డి గంగరాజు కుమారుడు ప్రవీణ్ కుమార్(28) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య ఉదయనాగిని(26) ఫిజియోథెరపిస్తుగా పని చేస్తున్నారు. వీరు హైదరాబాద్‌లోని తార్నాకలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు శ్రీత అనే ఏడాది వయస్సున్న కుమార్తె ఉంది.

ఆమె నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మండలం జైతాపురంలోని ప్రవీణ్ అత్తవారింటి వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో శనివారం వారాంతపు సెలవు కావడంతో ప్రవీణ్, నాగిని.. కుమార్తెను చూసేందుకు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో చాంద్రాయనపల్లి వద్ద టైర్ పేలిపోవడంతో వీరు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఆదివారం వీరి మృతదేహాలను గుమ్మిలేరుకు తీసుకొచ్చారు. దంపతుల మృతదేహాలను చూసిన వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ప్రవీణ్ కుమార్ పదోన్నతిపై మహారాష్ట్రలోని పుణె వెళ్లి మరొక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆదివారం చేరాల్సి ఉండగా, ఈ ప్రమాదంలో జరగడంతో వారు బోరున విలపించారు. ప్రవీన్, ఉదయనాగిని మృతదేహాలకు రాజమండ్రిలోని కోటిలింగాల రేవు శ్మశాన వాటికలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications