మ్యాన్ హోల్‌లోశవం, చంపేసి పడేశారా?: సూదిగాడి హల్‌చల్

హైదరాబాద్: సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి ఆవరణలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి నుంచి మురుగు నీరు విడుదలయ్యే మ్యాన్‌హోల్‌లో మృతదేహం కనిపించింది. ఓ వ్యక్తి అందించిన సమాచారంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు.

మ్యాన్‌హోల్‌లో శవం కనిపించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిత్యం సందడిగా ఉండే గాంధీ ఆస్పత్రి ఆవరణలోని మ్యాన్‌హోల్‌లోకి వ్యక్తి శవం ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చంపేసి శవాన్ని అందులో వేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాదులో మరోసారి సూదిగాడు హల్‌చల్ చేశాడు. హైదరాబాదులోని కూకట్‌పల్లి పరిధిలోని నిజాంపేట రాజీవ్ గృహకలప్ వద్ద శేఖర్ అనే యువకుడికి ఉన్మాది సూది గుచ్చి పరారయ్యాడు. స్థానికులు బాధితుడు శేఖర్‌ను అస్పత్రికి తరలించారు.

A dead body is found in a manhole in the premises of Gandhi hosptal in Secendurabad.

వివాహిత అదృశ్యం

హైదరాబాదులోని రామంతపూర్‌లో వడ్డీ వ్యాపారి మంజుల అదృశ్యమయ్యారు. రామంతపూర్‌లో తల్లిదండ్రుల వద్దకు వచ్చిన మంజులకు రుణం మొత్తం చెల్లిస్తామని ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆమె వసూలు కోసం వెళ్లింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది.

మంజుల అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వడ్డీవ్యాపారి మంజుల భర్తతో కలిసి బంజారాహిల్స్‌లో నివాసం ఉంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+