బోధన్ స్కాం: రెండేళ్లకు డిప్యూటీ కమిషన్ ఛార్జీ రూ.2కోట్లు, అవినీతి సొమ్మతో సినిమానే తీశారు!
బోధన్ కమర్షియల్ టాక్స్ స్కాంలో మరో ఉన్నతాధికారి అవినీతి బాగోతం బయటపడింది. ఇప్పటికే ఈ కేసులో 9మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది కటకటాలపాలుకాగా, తాజాగా మరో డిప్యూటీ కమిషనర్ పాత్ర వెలుగులోకి వచ
హైదరాబాద్: బోధన్ కమర్షియల్ టాక్స్ స్కాంలో మరో ఉన్నతాధికారి అవినీతి బాగోతం బయటపడింది. ఇప్పటికే ఈ కేసులో 9మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది కటకటాలపాలుకాగా, తాజాగా మరో డిప్యూటీ కమిషనర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు సీఐడీ విచారణలో వెల్లడయ్యాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. తనకు డిప్యూటీ కమిషనర్(డీసీ)గా ఓ అధికారి తనకు రూ.2కోట్లు ముట్టచెప్పాలని డిమాండ్ చేశారు. శివరాజు(ఈ కేసులో అరెస్టైన ఏ1 నిందితుడు) కుమారుడు సునీల్‌తో సదరు డీసీ నేరుగా బేరసారాలు సాగించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. 'రెండేళ్లపాటు పనిచేస్తా కాబట్టి ఏడాదికి రూ.కోటి చొప్పున రూ.2కోట్లు ఇవ్వాల్సిందే' అని ఆ డీసీ తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో అడ్వాన్స్ కింద రూ.25లక్షల నగదు చెల్లించినట్లు సునీల్ తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు సీఐడీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

అంతేగాక, మిగిలిన మొత్తాన్ని ప్రతినెలా రూ.10లక్ష్ల చొప్పున ఇవ్వాలని ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలిపారు. అలా ఇప్పటివరకు రూ. 80లక్షలు సంబంధిత డిప్యూటీ కమిషనర్‌కు అందినట్లు విచారణలో బయటపడిందని వెల్లడించారు. కాగా, వాణిజ్య పన్నుల శాఖలో ఒక్కో అధికారికి నెలకు 4లేదా 5 ఆడిటింగ్‌లు చేయాలని ఆదేశాలుంటాయి. దీని ప్రకారం సంబంధిత అధికారులు ఆడిటింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా సంబంధిత డిప్యూటీ కమిషనర్ రేటు ఫిక్స్ చేసినట్లు సీఈడీ వెలుగులోకి తెచ్చింది. ఒక్కో ఆడిటింగ్ టర్నోర్ ను బట్టి రూ.25వేల నుంచి రూ. 50వేల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు.
కాగా, ఆ డిప్యూటీ కమిషనర్ ఏడు సర్కింగ్ కార్యాలాయలు, నాలుగు ప్రధాన చెక్ పోస్టులున్నాయి. వీటి నుంచి సాగే జీరో దందా వ్యాపార సంస్థల వాహనాల నుంచి వసూలు చేసిన లంచాల్లో మెజారిటీ శాతం డిప్యూటీ కమిషనర్ దేనని సీఐడీ తేల్చింది. ఇలా రూ. 50వేల నుంచి రూ.75వేల వరకు పైస్థాయిలో ఉన్న అధికారులకు ఈ డిప్యూటీ కమిషనర్ ద్వారానే చేరుతుందని సీఐడీ గుర్తించింది.
అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలను సదరు డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్, నిర్మాణ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్లు సీఐడీ తేల్చింది. ప్రతి శుక్రవారం లేదా సోమవారం కార్యాలయానికి వెళ్లడం, తనకు రావాల్సిన వాటాను తీసుకోవడం, తన వెంట వచ్చే తండ్రికి ఆ మొత్తాన్ని ఇచ్చి ఆర్టీసీ బస్సులో పంపించడం ఆ డిప్యూటీ కమిషనర్ స్టైల్ అని తేలింది.
హైదరాబాద్ నగరంలో పోస్టింగ్ ఇప్పించాలంటూ ఈ డిప్యూటీ కమిషనర్ గతంలో ఓ మంత్రి ఓఎస్డీకి రూ.30లక్షలు ముట్టజెప్పారు. తీరా పోస్టింగులు అయ్యే సమయంలో మంత్రి పైరవీ పనిచేయలేదు. దీంతో అందరికిలాగే బదిలీపై పోస్టింగ్ ఇచ్చారు. దీంతో తాను పోస్టింగ్ కోసం ఇచ్చిన రూ.30లక్షలను ఇవ్వాలని ఓస్డీని డీసీ గట్టిగా నిలదీశారు. తన వద్ద లేవని, వెళ్లి మంత్రిగారితో చెప్పుకోండని, సదరు ఓఎస్డీ తెగేసి చెప్పారు. అయితే, మంత్రిని అడిగేందుకు ధైర్యం చాలకపోవడంతో ఇచ్చిన పోస్టింగ్‌కే వెళ్లారు.
కాగా, సంబంధిత డిప్యూటీ కమిషనర్ 5నెలల క్రితం మలేసియా వెళ్లినట్లు సీఐడీ గుర్తించింది. ఆ దేశం వెళ్లేందుకు రూ.2.5లక్షల ఖర్చును తామే భరించినట్లు సునీల్ విచారణలో ఒప్పుకున్నాడని సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. ఇది కూడ ఒప్పందంలో భాగంగానే జరిగిందని సునీల్ చెప్పారు.
స్కాం సొమ్ముతో సినిమా
వాణిజ్య పన్నుల శాఖలో వందల కోట్లు కొల్లగొట్టిన ఏ1 నిందితుడు ఎస్ఎల్ శివరాజు సినీరంగంలోనూ ప్రవేశించాడు. అక్రమార్జనతో వచ్చిన కోట్ల రూపాయలతో సినిమాలు నిర్మించినట్లు ఐసీడీ విచారణలో తేలంది. 'అమ్మా నీకు వందనం' అనే పేరుతో అతడు ఈ సినిమా నిర్మించాడు. దీనికి గతంలో కమిర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గాగ పని చేసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు దాదాపు రూ. 20కోట్లకు పైగా పెట్టుడి పెట్టినట్లు సీఐడీ అధికారులు తమ విచారణలో తేల్చారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు నకిలీ చలాన్ల ద్వారా తన ఖాతాలోకి మళ్లించుకున్న శివరాజు సినీ పరిచయాల కోసం ఈ చిత్రాన్ని వాడుకున్నట్లు అధికారుల స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications