హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కోసం వస్తే తగిన శాస్తి, రక్తం కారుతున్నా..: అభిమాని ఆవేదన

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటి పవన్ కళ్యాణ్ కరీంనగర్ పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు వచ్చిన అభిమానిని బాడీ గార్డులు, బౌన్సర్లు పక్కకు తోయడంతో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి.

Recommended Video

కాంగ్రెసుకు గుబులు, తెలంగాణలో పవన్ పక్కా ప్లాన్‌ !

పవన్ కళ్యాణ్ సమావేశ మందిరం నుంచి బయటికి వెళుతున్న సమయంలో ఆయనను కలిసేందుకు ప్రయత్నించిన కోటేష్ అనే అభిమానికి ద్వారం వద్ద ఉన్న అద్దాలు పగిలిపోవడంతో చేతికి, భుజం వద్ద గాయమైంది. దీంతో అతడు కొంత ఆవేదనకు గురయ్యాడు.

ఎంతో ఆశతో వచ్చాం

ఎంతో ఆశతో వచ్చాం


‘పవన్ కళ్యాణ్ అంటే మాకు పిచ్చి, ప్రాణం. పవన్ వస్తున్నాడని తెలిసి రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. మా అభిమాన నటుడు మాతో మాట్లాడతాడని ఎంతో ఆశతో ఎదురుచూశాం' అని కోటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.

తిండి కూడా లేదు.. తగిన గుణపాఠం

తిండి కూడా లేదు.. తగిన గుణపాఠం

‘తిండికూడా తినకుండా ఇక్కడే పడి వున్నాం. అయినా మాలాంటి అభిమానులతో పవన్ మాట్లాడకపోకపోతే ఎలా? వీఐపీలతోనే మాట్లాడటం అవసరమా? పవన్‌ను చూడడానికి వచ్చినందుకు మాకు మంచి గుణపాఠం చెప్పారు' తన భుజానికి రక్తం కారుతున్నా గాయాలను చూపిస్తూ కోటేష్ కొంత అసహనం వ్యక్తం చేశాడు.

పవన్‌! ‘పవరే' కానీ, అలా ఐతే జనసేన ఎందుకు?: నాగేశ్వర్ సంచలనం పవన్‌! ‘పవరే' కానీ, అలా ఐతే జనసేన ఎందుకు?: నాగేశ్వర్ సంచలనం

భారీగా వచ్చిన అభిమానులు

భారీగా వచ్చిన అభిమానులు

పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజా యాత్రలో భాగంగా రెండో రోజైన మంగళవారం కరీంనగర్‌లో పర్యటించారు. అక్కడున్న శ్వేతా హోటల్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పవన్ శ్వేతా హోటల్‌కు వస్తాడని తెలుసుకున్న అభిమానులు.. తమ అభిమాన నటుడు, నేతను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఫ్యాన్స్ ఉత్సాహం: గాయపడ్డ అభిమానిని చూసి చలించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉత్సాహం: గాయపడ్డ అభిమానిని చూసి చలించిన పవన్ కళ్యాణ్

పగిలిన గ్లాస్ డోర్

పగిలిన గ్లాస్ డోర్

హోటల్ నుంచి బయటికి వచ్చే సమయంలో పవన్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దీంతో అభిమానులను తోసేసుకుంటూ బౌన్సర్లు ముందుకు కదిలారు. కాగా, ఇక్కడ జరిగిన తోపులాటలో హోటల్ ద్వారం వద్ద ఉన్న గ్లాస్ డోర్ పగిలిపోయింది. గ్లాస్ డోర్‌ను బలంగా తోయడంతో గాజు ముక్కలు కొన్ని కొందరు అభిమానులకు గుచ్చుకున్నాయి.

తగిన శాస్తి.. ఆస్పత్రులకు తరలింపు..

తగిన శాస్తి.. ఆస్పత్రులకు తరలింపు..


ఈ ఘటనలో కోటేస్ అనే అభిమానికి కూడా భుజానికి, వీపుకు గాజు పెంకులు గుచ్చుకున్నాయి. దీంతో గాయమైనా కూడా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని కోటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ అభిమాన నేత కోసం వస్తే తగిన శాస్తి జరిగిందంటూ వాపోయాడు. కాగా, అక్కడేవున్న మరికొందరు గాయపడిన అభిమానులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

బాధపడితే చూడలేను

బాధపడితే చూడలేను


కాగా, అభిమానులు సంయమనం పాటించాలని, తన అభిమానులకు గాయాలు తగిలి బాధపడుతుంటే తాను చూడలేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని పవన్ కోరారు.

English summary
A fan fired at Janasena President Pawan Kalyan's bodyguards and bouncers in Karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X