మంత్రి ఈటెల సమక్షంలో రైతు ఆత్మహత్యయత్నం, కారణమిదే
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి ఈటెల రాజేందర్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి ఈటెల రాజేందర్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
మండలంలోని పొత్తూరు గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించేందుకుగాను మంత్రి రాజేందర్ ఆదివారం నాడు వచ్చారు. ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

అయితే పోలీసులు ఆయనను అడ్డుకొన్నారు. సాగునీరు అందక వరిపంట ఎండిపోయిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన సూచించారు.
అన్ని రకాలుగా రైతులను ఆదుకొంటామని ఈటెల రైతులకు హమీ ఇచ్చారు. ఎండిన పంటలను సర్వే చేయించి తగిన పరిహరం ఇస్తామని మంత్రి హమీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications