రేప్ : కన్న తండ్రే.. కూతురిపై కన్నేశాడు..
హైదరబాద్ : మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో తెలియజెప్పడానికి ఇంతకు మించిన పరాకాష్ట లేదు. వావి వరుసలకు సైతం తిలోదాకాలిచ్చి, తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం ఆఖరికి కన్న కూతుళ్ల పైనే అఘాయిత్యానికి తెగబడుతున్నారు కొంతమంది ప్రబుద్దులు. దేశంలొ మహిళా భద్రత నానాటికీ సందిగ్ఘంలో పడిపోతున్న నేపథ్యంలో .. ఆఖరికి సొంత ఇంట్లో కూడా రక్షణ లేని స్థితిలో బతుకెళ్లదీయడం నేటి స్త్రీల దయనీయ స్థితికి నిదర్శనం.
శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ మెకానిక్ గా పనిచేసే ఓ 40 ఏళ్ల తండ్రి, సొంత కూతురు (17) పైనే అత్యాచారం చేయడం ఈ చర్చలకు తావిచ్చింది. ఖాజీపురాలో సైకిల్ రిపేర్లు చేసుకుంటూ బతికే అతగాడికి భార్య, ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.
అయితే తరుచూ భార్యభర్తల మధ్య విబేధాలు, గొడవలు తలెత్తుతున్న క్రమంలో గత శనివారం సాయంత్రం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెతో పాటు ఇద్దరు కుమారులను వెంట తీసుకెళ్లగా, పెద్ద కుమారుడితో పాటు కూతురు కూడా ఇంట్లోనే ఉండిపోయింది. కాగా, భార్య పుట్టింటికి వెళ్లిపోయిన రోజు రాత్రి పీకల దాకా మధ్యం సేవించి ఇంటికి వచ్చాడు సదరు భర్త.

అతను ఇంటికి చేరుకున్న సమయానికి పెద్ద కుమారుడు ఏదో పనిమీద బయటికి వెళ్లడంతో, ఇంట్లో కుమార్తె ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా భావించి అతడు తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు. కన్న కూతురన్న కనీస మానవత్వం లేకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఘటన తర్వాత ఇంట్లో ఉండలేనంటూ, తనను కూడా తీసుకెళ్లిపోవాలని తల్లికి ఫోన్ చేసి కన్నీటి పర్యంతమైంది బాలిక. దీంతో ఆమె పుట్టినిల్లు అయిన ఫతేదర్వాజాకు తీసుకొచ్చేందుకై సోదరుడిని భర్త ఇంటికి పంపించింది.
దీంతో తల్లి దగ్గరికి చేరుకున్న బాలిక అసలు విషయాన్ని తల్లికి చెప్పి భోరుమనడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తల్లి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications