Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కసాయి తండ్రి .. భార్యపై కోపంతో పిల్లల్ని బావిలో పడేసి.. ఆపై

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో అభం శుభం తెలియని ఇద్దరు కుమారులను తండ్రి అకారణంగా అనంతలోకాలకు పంపేశాడు. భార్య తనతో గొడవ పడుతుంది అన్న కారణంతో క్షణికావేశంలో ఊగిపోయిన తండ్రి తన ఇద్దరు పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుపడేలా రక్తం పంచుకు పుట్టిన కొడుకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తండ్రి అత్యంత దారుణంగా వారిని హతమార్చాడు.

మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన

మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన


తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన వివరాల్లోకి వెళితే, గడ్డి గూడెం తండాలో రామ్ కుమార్ , శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు. రామ్ కుమార్ సిఎస్ఎఫ్ జవానుగా ముంబైలో పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చిన రామ్ కుమార్ తో భార్యకు బంగారం విషయంలో గొడవ మొదలైంది. గతేడాది రామ్ కుమార్ తన భార్య బంగారాన్ని బ్యాంకులో కుదువపెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ బంగారాన్ని విడిపించాలని భార్య భర్త పై ఒత్తిడి తెస్తోంది.

డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ.. పిల్లల్ని బావిలో విసిరికొట్టిన కన్నతండ్రి

డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ.. పిల్లల్ని బావిలో విసిరికొట్టిన కన్నతండ్రి

ఈ క్రమంలో ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. తన బంగారాన్ని ఖచ్చితంగా తీసుకురావాలని భార్య భర్తపై వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రామ్ కుమార్ భార్యపై చేయి చేసుకున్నాడు. ఆపై తన ఇద్దరు కుమారులు అయిన 8సంవత్సరాల జాక్సన్, ఆరు సంవత్సరాల జాని బెస్టో ను క్షణికావేశంలో బావిలో పడేశాడు. పిల్లలను బావిలో పడిన తర్వాత రామ్ కుమార్ గ్రామంలోకి వెళ్లి తన పిల్లలను బావిలో పడేసినట్లుగా చెప్పాడు.

తండ్రి రాక్షసత్వానికి ఇద్దరు కుమారులు బలి

తండ్రి రాక్షసత్వానికి ఇద్దరు కుమారులు బలి


దీంతో వెంటనే గ్రామస్తులు బావి దగ్గరకు వెళ్లి పిల్లలు బయటకు తీసేసరికి అప్పటికే వారిద్దరూ విగతజీవులుగా మారారు. పిల్లలిద్దరూ మరణించారని తెలిసిన తరువాత రామ్ కుమార్ అక్కడి నుండి పరారయ్యాడు. కడుపున పుట్టిన చిన్నారులు విగతజీవులుగా మారడంతో తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. బిడ్డల ప్రాణం తీసింది భర్తనే కావడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతోంది. ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రామ్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు.

బిడ్డ దూరమై, భర్త నేరస్తుడై శిక్ష అనుభవిస్తున్న తల్లి, క్షణికావేశమే దారుణానికి కారణం

బిడ్డ దూరమై, భర్త నేరస్తుడై శిక్ష అనుభవిస్తున్న తల్లి, క్షణికావేశమే దారుణానికి కారణం

నవమాసాలు మోసి కన్న కొడుకులను, భర్త దారుణంగా హతమార్చడంతో ఆ తల్లి దీనంగా రోదిస్తోంది. బిడ్డను చంపిన తండ్రి నేరస్థుడు కాగా, అటు బిడ్డకు దూరమై, ఇటు భర్త నేరస్థుడిగా మారి తల్లి శిక్షను అనుభవిస్తుంది. ఒక రాం కుమార్ మాత్రమే కాదు క్షణికావేశంలో, మితిమీరిన కోపంతో సంసారం విచ్ఛిన్నం చేసుకుంటున్న ఎంతోమంది, ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని పసి పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. భార్యపై కోపంతో బిడ్డలను నేలకు కొట్టి చంపుతున్న వారు, అనుమానంతో కన్న బిడ్డల ఉసురు తీస్తున్న తండ్రులు, ఇప్పుడు బావిలో విసిరికొట్టిన ఇలాంటి తండ్రుల చర్యలతో మానమ సంబంధాలు మృగ్యంగా మారుతున్నాయి. నిత్యం చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు రోజు రోజుకి కనుమరుగు అవుతున్న మానవ విలువలకు, రక్త సంబంధాలకు అద్దం పడుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+