రిసార్టులో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య: ప్రియుడే హంతకుడు, మరొకరితో స్నేహమే కారణమా?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లిలోని ప్రగతి రిసార్ట్‌లో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత దారుణంగా కొంతు కోసి హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. కొత్తూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శిరీష (20) అనే డిగ్రీ విద్యార్థిని శంకర్‌పల్లిలోని ప్రగతి రిసార్ట్‌లో దారుణ హత్యకు గురైంది. ఆమె ప్రియుడు సాయిప్రసాద్ ఈ దారుణానికి పాల్పాడ్డారు. గత కొంతకాలంగా శిరీష, సాయి ప్రసాద్ ప్రేమించుకుంటున్నారు.

మరొకరితో స్నేహంగా ఉంటోందని..
అయితే ఇటీవల శిరీష మరో యువకుడితో స్నేహంగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు సాయిప్రసాద్. ఈ విషయమై ఇరువురి మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది. దీంతో శిరీషపై కోపం పెంచుకున్న సాయిప్రసాద్ పథకం ప్రకారం.. మాట్లకుందాం రమ్మంటూ ఆమెను ప్రగతి రిసార్ట్‌కు పిలిచాడు.

ఏకాంతంగా గడిపి దారుణ హత్య
రిసార్ట్‌లో కాటేజీ బుక్ చేసుకొని ఏకాంతంగా గడిపినట్టు సమాచారం. అనంతరం యువకుడి గురించి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనను మోసం చేస్తోందని ఆవేశంగా ఉన్న సాయిప్రసాద్.. శిరీష గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. హత్య విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు ఎదురౌతాయని భావించిన రిసార్ట్ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు.

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు..
అయితే రాత్రి వరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా, హత్య గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగితే, రాత్రి 11 గంటలకు తల్లిదండ్రులకు విషయం తెలియచేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు శిరీష మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని శిరీష మృతదేహంతో రిసార్ట్ ముందు ఆందోళనకు దిగారు.

పెళ్లికాని వారిని ఎలా అనుమతించారు?
తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో నిందితుడు సాయిప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శిరీష మృతదేహాన్ని శుక్రవారం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. కాగా, ఈ సంఘటనపై మృతురాలి తండ్రి ఈశ్వర్ స్పందింస్తూ.. పెళ్లి కాని వారిని రిసార్ట్‌లోకి ఎలా అనుమతిస్తారంటూ నిలదీశారు.రిసార్ట్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications