రెండూ ముఖ్యమే!: పరీక్ష రాసి పెళ్లి పీటలెక్కిన యువతి

పెళ్లి రోజే పరీక్ష ఉండటంతో.. ఎలాంటి సందేహం లేకుండా పరీక్ష రాసి పెళ్లి పీటలెక్కింది ఆ యువతి.

ఆదిలాబాద్: జీవితంలో చదువు, వివాహం రెండు ముఖ్యమైన విషయాలే. అందుకే ఆ రెండింటికి సరైన ప్రాధాన్యతనిచ్చిన ఓ యువతి అందరి దృష్టిని ఆకట్టుకుంది. పెళ్లి రోజే పరీక్ష ఉండటంతో.. ఎలాంటి సందేహం లేకుండా పరీక్ష రాసి పెళ్లి పీటలెక్కింది ఆ యువతి.

ఆమే.. ఆదిలాబాద్‌ పట్టణం సరస్వతీ కాలనీకి చెందిన మోహన్‌, జమునల కుమార్తె రచన. ఆమెకు మంచిర్యాలకు చెందిన సాగర్‌తో శుక్రవారం ఉదయం 11.03 గంటలకు.వివాహం నిశ్చయమైంది.

A girl writes exam on her wedding day

కాగా, అదే సమయంలో ఆమెకు డీఎడ్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలున్నాయి. భర్త, పెళ్లి పెద్దల సహకారంతో సమాలోచనలు జరిపి చివరకు పరీక్ష రాసేందుకే మొగ్గుచూపింది. పరీక్ష రాసిన మరుక్షణమే పెళ్లిపీటలెక్కిన యువతి పట్టుదలను చూసి బంధువులు తొలుత ఆశ్చర్యం వ్యక్తం చేసినా చివరకు అర్థం చేసుకొని ఆశీర్వదించారు. దీంతో రెండు ముఖ్యమైన ఘట్టాలు ఆనందంగా ముగిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+