Crime News: మరొకరితో లాడ్జిలో భార్య.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే..
ఈ మధ్య వివాహబంధం భారమవుతోంది. భార్యభర్తలు ఎవరికి వారుగా నడుచుకుంటున్నారు. పెడదారులు పడుతున్నారు. ఇతరులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక్కోసారి ఈ వివాహేతర సంబంధల వల్ల ప్రాణాలు తీసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. తాజాగా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

సెక్యూరిటీ గార్డు
రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌కు చెందిన పత్లావత్ రామకృష్ణ గౌలిదొడ్డిలోని ఓసంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సెక్యూరిటీ గార్డుతో పాటు పుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తుండేవాడు. అతని భార్య అరుణ ఉంది.
ఆమె గత కొద్ది రోజులుగా తన తమ్ముడు సంతోష్ తో వివాహేతర సంబంధం ఉందని రామకృష్ణ అనుమానిస్తున్నాడు.

ఓ లాడ్జిలో
అప్పటి నుంచి అరుణ కదలికలను గమనిస్తున్నాడు. శనివారం రాత్రి శనివారం గౌలిగూడలోని ఓ లాడ్జిలో అతని తమ్ముడు సంతోష్‌తో తన భార్య అరుణ కలిసి ఉండగా రామకృష్ణ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో అరుణ, రామకృష్ణకు మద్య మాటామాట పెరిగింది. ఆగ్రహానికి గురైన రామకృష్ణ తన వెంట తెచ్చుకున్న కత్తితో అరుణ గొంతుకోశాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది.

పోలీస్ స్టేషన్ లో
ఆ తర్వాత రామకృష్ణ పోలీస్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్నిపోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణను రిమాండ్ కు తరలించారు.












Click it and Unblock the Notifications