గోల్డ్ స్టోన్ ప్రసాద్ మాయ: హైదర్ నగర్లోని భూమి తాకట్టుపెట్టి రూ.550 కోట్ల రుణం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన భూమాయకు బ్యాంకులు కూడ బోల్తాపడ్డాయి.వివాదాస్పద భూములను తనఖాపెట్టుకొని కోట్లాదిరూపాయాలను రుణాలుగా ఇచ్చాయి.దీంతో బ్యాంకులు లబోదిబోమంటున్నాయి.

హైదర్ నగర్ లోని సర్వే నెంబర్ 172 లో వివాదాస్పద భూమికి సైతం కోట్లాదిరూపాయాలను బ్యాంకులో తాకట్టు పెట్టి తీసుకొన్నాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. నిజాం వారసులు, సైరస్ కుటుంబీకులకు సంబంధించిన భూ వివాదం కేసులో ఫైనల్ డిక్రీ రాకున్నా ఆ భూములను గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనుయాయులకు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది.

A jewellery shop owner purchased 48 acres from Goldstone Prasad

ఈ భూములను గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఇతరులకు విక్రయించాడు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ చెబుతున్న జీపీఏ అసలు ఉందో లేదో పరిశీలించకుండానే కొందరు సబ్ రిజిస్ట్రార్ లు రిజిస్ట్రేషన్లు చేశారు.

మియాపూర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హైదర్ నగర్ లలో వేలాది ఎకరాల ప్రభుత్వ అటవీ భూములు, ప్రైవేట్ పరమౌతున్నాయి.హైదర్ నగర్ లోని సర్వేనెంబర్ 172 లోని 48 ఎకరాలను గోల్డ్ స్టోన్ ప్రసాద్ నగరానికి చెందిన ఓ జ్యూయలరీ వ్యాపారీ కొనుగోలు చేశాడు.

ఈ భూమి మొత్తాన్ని తనకు చెందిన 13 సూట్ కేసు కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి , ఆ భూములపై ఓ జాతీయ బ్యాంకు నుండి రూ.550 కోట్ల రుణం తీసుకొన్నారు.

ఈ భూములను ముంబైకి చెందిన సైరస్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ లిమిటెడ్ నుండి జిపిఏ ఉందని, దాని ద్వారానే సంక్రమించిన హక్కుల మేరకు విక్రయించినట్టు పేర్కొన్నాడు.

గోల్డ్ స్టోన్ ప్రసాద్ పేర్కొన్నట్టు ఆ జిపిఏ నకలు పత్రాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించలేదు. జీపీఏ రిజిస్ట్రేషన్ నెంబర్ గానీ, జీపీఏ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగిందన్న వివరాలను కూడ దస్తావేజులో పేర్కొనలేదు. జీపీఏకు సంబందించిన కనీస వివరాలను పరిశీలించకుండా కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయడం , ఆ మార్ట్ గేజ్ తో జ్యూయలరీ వ్యాపారి బ్యాంకుల నుండి రుణం తీసుకొన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A jewellery shop owner purchased 48 acres from Goldstone Prasad in 172 survey number at Hyderguda.jewellery shop owner mortgage this land a national bank and got Rs. 550 crore
Please Wait while comments are loading...