భర్త నైట్ డ్యూటీకి వెళ్ళగానే, భార్యపై సామూహిక అత్యాచారం, ఎందుకిలా..
భర్త నైట్ డ్యూటీకి వెళ్ళగానే ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన జరిగి చాలరోజులు అవుతోంది.అయితే ఎట్టకేలకు బాధితురాలు భర్తకు చెప్పింది. బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు.
హైదరాబాద్ :భర్త నైట్ డ్యూటీకి వెళ్ళగానే ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన జరిగి చాలరోజులు అవుతోంది.అయితే ఎట్టకేలకు బాధితురాలు భర్తకు చెప్పింది. బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైద్రాబాద్ లోని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య, భర్తలునివాసం ఉంటారు. భార్య కు మాటలు రావు. భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
గత నెల 25వ, తేదిన రాత్రి భర్త నైట్ డ్యూటీకి వెళ్ళగానే ఇద్దరు యువకులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆ మహిళపై అత్యాచారం చేశారు.

నిందితులు ముసుగులు ధరించారు.అయితే బాధితురాలిపై అత్యాచారం చేసే సమయంలో ఓ నిందితుడి ముసుగు తొలగిపోయింది. నిందితుడు పక్కింట్లో నివాసం ఉండే షరీఫ్ గా బాధితురాలు గుర్తించింది.
అయితే ఈ ఘటనను నీరుగార్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఎట్టకేలకు బాధితులు చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
ఈ ఫిర్యాదు మేరకు షరీఫ్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. షరీఫ్ తో పాటు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన మరో నిందితుడి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications