భార్యను కాపురానికి పంపమంటే కత్తితో దాడి

హైదరాబాద్: తన భార్యను కాపురానికి పంపించమంటూ వెళ్లిన భర్త, అతని సోదరుడిపై మామ కత్తితో దాడి చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేష్ కథనం ప్రకారం.. పాతబస్తీ వట్టెపల్లి గుంటాల్ బాబాదర్గాలో ఉండే పసిఖాన్(24)కు హబీబ్‌నగర్‌లో ఉండే ఇబ్రహీం(47) కుమార్తె లతీఫా ఉన్నిసా బేగం(20)తో ఏడు నెలల క్రితం వివాహం జరిగింది.

పెళ్లయిన నాటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల బక్రీద్‌కు పుట్టింటికి వెళ్లిన లతీఫా తిరిగి రాలేదు. దీంతో శనివారం రాత్రి ఫసిఖాన్ తన తల్లిదండ్రులు, తమ్ముడు షఫీఖాన్‌లను తీసుకొని అత్తింటికి వెళ్లి తన భార్యను పంపించమని కోరాడు. ఇబ్రహీం తన కూతురును పంనని తేల్చి చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.

ఆగ్రహంతో ఇబ్రహీం ఇంట్లోని కత్తితో అల్లుడిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన షఫీఖాన్‌పై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో ఫసిఖాన్‌కు తీవ్రగాయాలు కాగా, వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో ఇబ్రహీంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

A man allegedly attacked on his daughter husband

ఇది ఇలా ఉండగా బాధితుడు ఫసిఖాన్ భార్య లతీఫా తనను అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారని అత్తా, మామ, భర్త, మరిదిపై ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారిపై వృద్ధుడి అసభ్య ప్రవర్తన

ఓ పదకొండేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతల్‌లోని ద్వారకాపురికాలనీ నివాసి ఆనంద్(70) వైద్య పరీక్షల నిమిత్తం ఆదివారం సాయంత్రం అదే ప్రాంతంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వచ్చాడు. అక్కడే ఉన్న బాలిక పట్ల ఆ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+