మరో విషాదం: హైదరాబాద్ మెట్రో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య (వీడియో)
హైదరాబాద్: నగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి 9.16 గంటల సమయంలో మెట్రో రైలు ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. టికెట్ తీసుకోకుండా స్టేషన్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి.. ట్రాక్‌పైకి చేరుకుని రైలు రాగానే పట్టాలపై దూకేశాడు.
ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోను బట్టి చూస్తే అతని శరీరం ముక్కలు ముక్కలు అయినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, మెట్రో స్టేషన్లలో ఇటీవల ఆత్మహత్య ఘటనలు పెరిగిపోవడం ఆందోళనకర అంశంగా మారింది.

ఇది ఇలావుండగా, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి జనవరి 4న బుధవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మెట్రో స్టేషన్ పైనుంచి దూకి తీవ్రగాయాలపాలై మరణించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా, మృతురాలిది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Horrible Video: Man suicides after jumping before #HyderabadMetro Train before it stops at #Moosapet Metro station#Hyderabad pic.twitter.com/5F80aeXG9J
— Venkatesh Kandepu (@venkateshkande3) January 6, 2023
కాగా, 20 రోజుల క్రితం నాగోల్ లో కూడా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మెట్రో స్టేషన్లలో ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకుంటుండటం నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications