వ్యక్తిపైకి దూసుకెళ్లిన బస్సు: మృతి, ఉద్రిక్తత
హైదరాబాద్: నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని శంషాబాద్ తొండుపల్లి వద్ద చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన స్థానికులు, మృతుని బంధువులు బస్సు అద్దాలను పగలగొట్టి పూర్తిగా ధ్వంసం చేశారు.
పెద్ద సంఖ్యలో స్థానికులు, మృతుడి బంధువులు రహదారిపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. మృతుడికి న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ఆందోళనకారులు తేల్చి చెప్పారు.
దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనా స్థలం వద్దకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు.. ఆందోళనకారులకు సర్దిచెప్పి అక్కడ్నుంచి పంపించివేశారు.

ఎస్సైపై దాడి చేసిన నైజీరియన్లు
డ్రంక్ డ్రైవర్ తనిఖీ చేస్తున్న పోలీసులపై ముగ్గురు నైజీరియన్లు దాడికి దిగారు. వారి దాడిలో ఎస్సై, కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన టోలీచౌకీ పోలీసులు ఓ నైజీరియన్‌ను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నైజీరియన్లు తప్పించుకుని పరారయ్యారు.
నైజీరియాకు చెందని పలువురు తమ పాస్ పోర్టు గడువు ముగిసినా నగరంలోనే అక్రమంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా వారు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications