రూ. 12 వేల కోసం భార్యను హతమార్చిన భర్త, పెరట్లో పాతిపెట్టాడు

డబ్బుల కోసం ఘర్షణ పడి తన భార్యను హత్య చేశాడు ఓ వృద్ధుడు. ఆ తర్వాత మృతదేహాన్ని పెరట్లో పాతి పెట్టాడు.

కరీంనగర్: డబ్బుల కోసం ఘర్షణ పడి తన భార్యను హత్య చేశాడు ఓ వృద్ధుడు. ఆ తర్వాత మృతదేహాన్ని పెరట్లో పాతి పెట్టాడు. మూడు రోజుల వరకు ఈ విషయం బయటకు రాలేదు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన తోట అయిలయ్య(85), అమృతవ్వ (80)దంపతులకు పిల్లలు లేరు

వీరిద్దరే ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల మరుగుదొడ్డిని నిర్మించుకోగా వచ్చిన 12 వేల రూపాయలను అమృతవ్వ తన దగ్గర ఉంచుకుంది. డబ్బులు తనకు ఇవ్వాలని అయిలయ్య గురువారం రాత్రి గొడవ పడ్డాడు.

ఆ తర్వాత కర్రతో తలపై బాది గొంతు నులిమి చంపేశాడు. పెరట్లో అమృతవ్వ మృతదేహాన్ని పాతి పెట్టాడు. శనివారం వీరి సమీప బంధువు సునీల్‌ వారి ఇంటికి వెళ్లి అమ్మమ్మ ఎక్కడ ఉందని అయిలయ్యను ప్రశ్నించారు. రెండుమూడు సార్లు గట్టిగా అడగడంతో 'అమ్మమ్మెక్కడుందిరా.. చంపి అక్కడ పాతిపెట్టిన చూసుకపో' అని చెప్పాడు. ఆదివారం మృత దేహాన్ని వెలికి తీశారు.

అస్తమించిన కడవెండి వజ్రం
తెంగాణ సాయుధ పోరాట యోధురాు, ధీరవనిత న్ల వజ్రమ్మ కన్నుమూత

జనగామ: తెంగాణ సాయుధ పోరాట యోధురాలు, జనగామ జిల్లా కడవెండి గ్రామానికి చెందిన సాయుధ పోరాట యోధుడు నల్ల నర్సింహులు భార్య నల్ల వజ్రమ్మ (95) కన్ను మూశారు. జనగామలోని కూర్మవాడలో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు.

A man allegedly killed his wife for Rs. 12000

వజ్రమ్మ మరణ వార్త పువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె భౌతికకాయంపై సీపీఐ నాయకు అరుణ పతాకాన్ని కప్పి నివాళుర్పించారు. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి. ప్రేమతారెడ్డి, పువురు సీపీఎం నాయకు వజ్రమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళుర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ నేతు టి శ్రీనివాస్‌రావు, టి వెంకట్రాము, సీహెచ్‌ రాజారెడ్డి తదితయి సంతాపం తెలిపారు. వందలాది ప్రజు, ప్రముఖు అశ్రునయనా మధ్య వజ్రమ్మ అంత్యక్రియు జరిగాయి.

భర్త దారిలోనే తుపాకీ పట్టి....

వజ్రమ్మకు తొమ్మిదేళ్ల ప్రాయంలోనే న్ల నర్సింహులుతో వివాహం కాగా.. ముగ్గురు కుమార్తెలు జన్మించారు. విస్నూరు దేశ్‌ముఖ్‌, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన యోధుడు నల్ల నర్సింహులు. వజ్రమ్మ కూడా భర్త బాటలోనే తుపాకీపట్టి సాయుధ, గెరిల్లా పోరాటంలో పాల్గొని రాజాకారు దాష్టీకాలను ఎదిరించారు. కుట్ర కేసులో 1952లో పోలీసు నిండు గర్భిణిగా ఉన్న వజ్రమ్మను నిర్బంధించి జైలులో పెట్టారు. 25 రోజు జైలు జీవితం గడిపి జైలులోనే పెద్ద కుమార్తెను జన్మనిచ్చారు. విస్నూరు దేశ్‌ముఖ్‌ అన్యాయాు, అరాచకాకు, నిజాం దొరకు ఎదురు తిరిగి ధీరవనితగా పేరుపొందారు.

వివాహిత అనుమానాస్పద మృతి

వరంగల్‌: ఏనుమాముల గ్రామానికి చెందిన దామెర రాధిక (30) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యులు, పోలీసులు వివరాల ప్రకారం... ఎనుమాములలో రాధికవిజయ్‌కుమార్‌ దంపతు నివసిస్తుండగా విజయ్‌కుమార్‌ సీకేఎం ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.

అయితే రాధికను శనివారం అర్ధరాత్రి సమయంలో చిత్రహింసకు గురిచేసి అదనపు వరకట్నం తెమ్మని అత్త, భర్త కలిసి చంపినట్లు ఆమె కుటుంబీలకు పోలీసుకు ఫిర్యాదు చేశారు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరుగగా ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. బాధితురాలి తండ్రి యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఇంతేజార్‌ గంజ్‌ ఎస్సై రమేష్‌ కుమార్‌ తెలిపారు. ఏసీపీ చైతన్యకుమార్‌, మట్టెవాడ సీఐ రవికుమార్‌, మిల్స్‌కానీ సీఐ తిరుమల్‌ ఆ ఇంటిని పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+