హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: రూ.100 కోసం తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం వంద రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో సొంత తమ్ముడినే అన్న హతమార్చాడు.

పంజాగుట్ట పరిధిలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన కర్రోల రాములు (30), కర్రోల పోశయ్య (28) అన్నాదమ్ములు. పోశయ్య హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తుండగా, రాములు ఎల్లారెడ్డిగూడలో టెంట్‌హౌజ్‌లో పనిచేస్తున్నాడు.

కాగా, శనివారం టెంట్‌హౌజ్ వద్దకు వచ్చిన పోశయ్యను రాములు రూ.వంద ఇవ్వాల్సిందిగా కోరాడు. డబ్బులు లేవనడంతో టెంట్‌హౌజ్‌లో ఉన్న పెట్రోల్‌ను పోశయ్యపై చల్లి నిప్పంటించారు.

A man allegedly murdered his brother

20 శాతం గాయాలైన పోశయ్యను టెంట్‌హౌజ్ నిర్వాహకులు గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతుండగానే పోశయ్య సోమవారం ఇంటికి తిరిగి వచ్చేశాడు. రాత్రి నిద్రించిన పోశయ్య మంగళవారం ఉదయానికి విగతజీవిగా మారాడు. కాగా, ఘటన జరిగిన రోజే రాములును పోలీసులు అరెస్టు చేశారు.

బావను హత్య చేసిన బావమరిదికి రిమాండ్

మద్యం మత్తులో రోకలిబండతో బావను హతమార్చిన ఘటనలో బావమరిదిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్‌స్పెక్టర్ ఎస్ వెంకట్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం గుంజల్‌పహాడ్ గ్రామానికి చెందిన బుడగజంగాల అంజయ్య(52), ఎల్లయ్య(45) బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి లక్ష్మీగూడ రాజీవ్‌గృహకల్ప సముదాయాల సమీపంలో గుడిసెల్లో నివాసముంటున్నారు. అయితే, అంజయ్య వరుసకు బావమరిది అయిన ఎల్లయ్యకు కొన్ని నెలల క్రితం అదే జిల్లాకు చెందిని ఓ అమ్మాయితో పెళ్ళి చేశాడు.

కాగా, ఎల్లయ్య భార్య మూడు నెలల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందింది. తనకు ఆనారోగ్యంతో ఉన్న అమ్మాయితో పెళ్ళిచేశాడని ఆగ్రహంతో ఉన్న ఎల్లయ్య తన బావ అంజయ్యను మద్యం మత్తులో మార్చి 11వ తేదీన రాత్రి రోకలి బండతో మోది తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అంజయ్య ఆదివారం రాత్రి మృతిచెందాడు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఎల్లయ్యను పోలీసులు మంగళవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.

English summary
A man allegedly murdered his brother for Rs. 100, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X