Traffic Police: ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తట్టులేక వ్యక్తి ఆత్మహత్య
ఈ మధ్య ట్రాఫిక్ పోలీసుల వేధింపులు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బండి ఆపి చలాన్లు విధించి పైసలు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. తాజాగా ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లిలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన పాలకుర్తి మొగిలి వరంగల్ లో ఓ బట్ట షాపుల పని చేస్తున్నాడు. అతను రోజు ఉదయం స్కూటీపై వరంగల్ వెళ్లి సాయంత్రం తిరిగి వస్తాడు.
మే 21న రోజులాగే వరంగల్ వెళ్తున్న మొగిలిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. బండి నంబరు చూసి చెక్ చేయగా.. బండిపై 17 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. దీంతో జరిమానాలు చెల్లించాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారు. లేకుంటే స్కూటీ సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో అక్కడ నుంచి ఇంటికి వచ్చిన మొగిలి మనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు.

మొగిలి చావు కారణమైన పోలీసులు శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. అంతకు ముందు కూడా హైదరాబాద్ శివారులో ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్ ఐఎస్ సదన్ లో ఉంటున్న ఎల్లయ్య హమాలీగా పని చేస్తున్నాడు. అతను ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. పండి చలాన్లు పెండింగ్ లో ఉండడంతో చెల్లించాలని కోరారు. రూ.10 వేల ఎలా కట్టగలని ఎల్లయ్య చెప్పగా స్కూటీ సీజ్ చేశారు. మనస్తాపం చెందిన ఎల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఎల్లయ్య ఓ లేఖ కూడా రాశారు. లేఖలో చలాన్ల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నాడు.
కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల చలాన్ల బాధలు భరించలేక ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్‌కు నిప్పు పెట్టాడు. పంజాబ్ చౌరస్తాలో ట్రాపిక్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఖానాపూర్‌కు చెందిన మక్బూల్ అనే వ్యక్తి తన బైక్‌కు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది.












Click it and Unblock the Notifications