Kamareddy: కామారెడ్డిలో సైబర్ క్రైమ్.. రూ.9 లక్షలు నష్టపోయిన వ్యక్తి..!

దేశంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరాలు పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లో కూడా జరుగుతోన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాల్లో ఓ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ.9 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. చివరికి మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కామారెడ్డికి చెందిన కిషన్ రావు అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తను పోలీసుగా పరిచయం చేసుకున్నాడు.

తాము ఢిల్లీ పోలీసులమని చెప్పాడు. మీపై డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులు నమోదుట్లు చెప్పాడు. దీంతో కిషన్ రావు భయపడిపోయాడు. సదరు వ్యక్తి మీమ్మల్ని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక పోలీస్ బృందం వస్తుందని చెప్పాడు. మీమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే.. కొంత మొత్తం బదిలీ చేయాలన్నాడు. విచారణ పూర్తయ్యాక డబ్బులు తిరిగి అకౌంట్ లో జమ చేస్తామని చెప్పాడు. ఇది నమ్మిన కిషన్ రావు.. విడతల వారీగా ఫోన్ చేసిన వ్యక్తికి డబ్బులు బదిలీ చేశాడు.

A man from Kamareddy lost Rs 9 lakhs to cyber criminals

ఇలా రూ. 9లక్షల 29వేల రూపాయలు పంపాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బాధితుడు తన మోసపోయినట్లు గుర్తించి 1930కి కాల్‌‌‌‌ చేసి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినప్పటికీ కొందరు భయపడి పోతున్నారు. సైబర్ నేగాళ్లు తాము సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతారని.. అలాగే ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెబుతారని.. వాటిని నమ్మొద్దని కోరారు. అలాగే ఎలాంటి పాస్ వర్డ్ లు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.

అలాగే వాట్సాప్ లో ఏపికే ఫైల్స్ వస్తాయని.. వాటిని క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకుంటే.. మల్ వేర్ ఫోన్ లోకి వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ఫోన్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) పోలీసులు రాజస్థాన్‌లో సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. సైబర్‌ నేరాలతో సంబంధమున్న 27 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+