వివాహేతర సంబంధం: కిడ్నాప్ చేసి హత్య చేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇల్లెందు:వివాహేతర కారణంతో నర్సింహ్మరావును అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు.ఆయనను ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల పరిధిలోని లచ్చుగూడెం గ్రామానికి చెందిన రచ్చ నర్సింహ్మరావును ఆదివారం రాత్రి హత్య చేశారు ప్రత్యర్థులు.

a man murdered for illegal affair in khammam district

ముకుందాపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సినీ పక్కిలో ఆయనను కిడ్నాప్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు అలిగేడ్ సమీపంలో నర్సింహ్మరావును హత్య చేశారు. నర్సింహ్మరావును హత్యచేసిన తర్వాత నిందితులు బయ్యారం పోలీసులకు లొంగిపోయారు.

నర్సింహ్మరావును వివాహేతర సంబంధం ఉందని గతంలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ కారణంగా ఆమె భర్త విడాకులు ఇచ్చాడు.తన కుటుంబం విచ్చిన్నం కావడానికి నర్సింహరావే కారణమని భావించిన ప్రత్యర్థులు ఆయనను ఆదివారం నాడు కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man murdered for illegal affair in khammam district on sunday night. after murdered accuse surrendered in bayyaram police station.
Please Wait while comments are loading...