ఆరేళ్ళ బాలికపై అత్యాచారం చేసి ఆపై హతమార్చిన మానవ మృగం.. పెద్దపల్లిలో దారుణ ఘటన
తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మానవ మృగం ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆరేళ్ల బాలిక పైన అత్యాచారం చేసేందుకు బాలికను తీసుకువెళ్లిన సదరు కామాంధుడి వీడియో కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అసలు ఏం జరిగిందంటే
నిద్రిస్తున్న బాలికను పొదల్లోకి తీసుకెళ్ళిన కామాంధుడు
పెద్దపల్లి జిల్లాలోని ఒక రైస్ మిల్లులో పనిచేస్తున్న తల్లి తనతో పాటు బాలికను కూడా తీసుకొని వెళ్లి పని చేసుకుంటుంది. గురువారం రాత్రి తన తల్లితో కలిసి రైస్ మిల్లులో నిద్రిస్తున్న బాలికను అదే మిల్లులో డ్రైవర్ గా పనిచేస్తున్న బలరాం అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు.నిద్రిస్తున్న బాలికను తీసుకొని సమీపంలో ఉన్న పొదల్లోకి వెళ్లి అత్యాచారం చేశాడు.

బాలికను అత్యాచారం చేసి హతమార్చిన మానవ మృగం
ఆ తర్వాత బాలిక ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి అక్కడే బాలికను హతమార్చాడు. ఆపై ఏమీ ఎరగనట్టు వచ్చేశాడు. అయితే అర్ధరాత్రి సమయంలో తన పక్కన బాలిక లేదని గుర్తించిన తల్లి తోటి కార్మికులతో కలిసి చుట్టుపక్కల పరిసరాల్లో వెతికింది. అక్కడ విగతజీవిగా పడి ఉన్న బాలికను గుర్తించింది. బాలిక అత్యాచారానికి గురైంది అని గ్రహించిన తల్లి పోలీసులకు సమాచారం అందించింది.
సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడి గుర్తింపు
బాలికను ఎవరు తీసుకు వెళ్లారు అన్నది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన తల్లి, నిందితుడిని పోలీసులకు అప్పగించింది. ఇక ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బాలికను తీసుకు వెళుతున్న దృశ్యాలు సిసిటీవీలో నమోదు కావడంతో నిందితుడిని గుర్తించగలిగారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఏది ఏమైనా ఆరేళ్ల పసి బాలిక పైన దారుణ అత్యాచారానికి పాల్పడి, ఆపై ప్రాణాలు తీసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పసివాళ్లను కూడా వదలకుండా అత్యాచారాలకు పాల్పడుతున్న ఇటువంటి వారిని కఠినంగా శిక్షించకుంటే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications