కలహాలు: ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం
మహబూబ్‌నగర్: జిల్లాలోని ఉప్పునుంతలలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల గొంతులు కోసి చంపేసిన తల్లి తనూ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పునుంతలకు చెందిన కొత్త నర్సింహారెడ్డి, శ్రీమతమ్మ (22) భార్యాభర్తలు. ఆరేళ్ల క్రితం వివాహం జరిగిన వీరికి కొడుకు జశ్వంత్ (5), కూతురు లక్కీ (2) ఉన్నారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుండేవారు.
కాగా, శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నర్సింహారెడ్డి భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. భార్య శ్రీమతి పిల్లలు ఇంట్లో ఉన్నారు. నిద్రకు ఉపక్రమించిన ఇద్దరు పిల్లలను అతిదారుణంగా గొంతులు కోసి చంపేసింది. అనంతరం ఆమె కూడా బలవంతంగా కత్తితో గొంతుకోసుకుంది.

బయట వరండాలో టీవీ చూస్తున్న అత్త, ఇంటి పక్క మహిళలు ఇంట్లోని గది నుంచి ఏదో శబ్దం రావడం గమనించారు. తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు అప్పటికే చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారు. శ్రీమతి మాత్రం గొంతు భాగం కొంచెం తెగి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న ఆమెను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలను చంపి తాను చనిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయో ఎవరికీ అంతుబట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలు పిల్లలతో కలివిడిగా ఉండేవారని తెలిపారు. కుటుంబ సమస్యలే ఈ దారుణానికి కారణం కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
కరెంట్ షాక్‌తో అత్తా, కోడలు మృతి
నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం రావులపెంటలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరెంటు షాక్‌తో అత్త, కోడలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దండెంపై బట్టలు ఆరేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.












Click it and Unblock the Notifications