అమ్మతనానికే కళంకం: ముక్కుపచ్చలారని ముగ్గురు బిడ్డలను అక్రమసంబంధం కోసం ఏం చేసిందంటే!!
అమ్మంటేనే బిడ్డల కోసం ఏ త్యాగం చేయడానికి అయినా వెనకాడని మాతృమూర్తి.. అమ్మంటేనే కష్టం వచ్చినా, కన్నీళ్లు వచ్చినా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకునే కరుణామయి. అటువంటి అమ్మతనానికి అర్థం మార్చేసి అమ్మ అన్న పదానికి కళంకం తీసుకువచ్చింది ఓ మహాతల్లి. వివాహేతర సంబంధం కోసం కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలను అర్ధరాత్రి చిమ్మి చీకట్లో వదిలేసి వెళ్ళిపోయింది.

ముక్కుపచ్చలారని చిన్నారులను అర్దరాత్రి వదిలి వెళ్ళిన తల్లి
తమ తల్లి తమను ఎక్కడ వదిలేసింది? ఎందుకు వదిలేసింది? తాము ఏం చేయాలి అనేది అర్థం కాని ఆ పిల్లలు చలిలో వణుకుతూ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. యాదగిరిగుట్టలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన విన్నవారి మనసులను కలచివేస్తుంది. ఆ పిల్లల్ని చూసిన వారంతా ముక్కుపచ్చలారని చిన్నారుల్ని వదిలి వెళ్ళడానికి ఆ తల్లికి ఎలా మనసు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..

నలుగురు పిల్లలు పుట్టాక వెళ్ళిపోయిన తండ్రి.. వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లి
పోలీసులు, బాధిత చిన్నారులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని భగత్ సింగ్ నగర్ కు చెందిన బాబురావు, లక్ష్మి 12 ఏళ్లు క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి నలుగురు పిల్లలు. పదేళ్లు, ఐదేళ్లు, రెండేళ్లు వయసులో ముగ్గురు కుమారులు, ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్న ఒక కుమార్తె ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి నుంచి బాబురావు, లక్ష్మీ ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవారు. ఇక మూడేళ్ల క్రితం బాబురావు ఇంట్లో చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇక తర్వాత లక్ష్మి అదే ప్రాంతానికి చెందిన ఇంకో ఆటో డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకొని ఇటీవల అతడిని పెళ్లి చేసుకుంది.

కాపురానికి పిల్లలు అడ్డం అని భావించి ముగ్గురిని యాదాద్రిలో వదిలి వెళ్ళిన తల్లి
ఇక తమ కాపురానికి పిల్లలు అడ్డంగా ఉన్నారని భావించి వారిని వదిలించుకోవాలని ప్రయత్నం చేసిన లక్ష్మి, సదర్ ఆటో డ్రైవర్ ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి యాదాద్రి కి చేరుకొని రెండేళ్ల కొడుకుని తమ వద్ద ఉంచుకొని మిగతా పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పండుగ ముందు రోజు అత్యంత అమానుషంగా పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తల్లి చేసిన పనికి పిల్లలు యాచకులుగా మారారు. పండుగ రోజు అక్కడికి వచ్చిన భక్తులు కొందరు ఇచ్చిన డబ్బులతో వారు తమ ఆకలి తీర్చుకున్నారు.

బాలల సంరక్షణా కేంద్రానికి చేరిన బాలలు.. పిల్లలు చెప్పిన షాకింగ్ విషయాలు
యాదాద్రి వద్ద భిక్షాటన చేస్తున్న ఈ పిల్లలను అక్కడి కానిస్టేబుల్ చూసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. స్థానిక ఎస్సై జిల్లా బాలల పరిరక్షణ అధికారికి బాలలను అప్పగించి భువనగిరిలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 17వ తేదీన బాలల పరిరక్షణ విభాగం అధికారులు పిల్లలను విచారించగా 10 సంవత్సరాల వయసున్న పెద్ద పిల్లవాడు తన పెదనాన్న ఫోన్ నెంబర్ ను చెప్పాడు. దీంతో అధికారులు అతడిని భువనగిరికి రప్పించి విచారించగా ఆ పిల్లలు తన తమ్ముడి కుమారులేనని, అయితే వారి కుటుంబానికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఇదే సమయంలో బాలల పరిరక్షణ విభాగం అధికారులకు విస్మయం కలిగించే మరికొన్ని విషయాలను పిల్లలు చెప్పారు.

ఐదేళ్ళ కొడుకును చంపే యత్నం చేసిన తల్లి.. పోలీసుల కేసు నమోదు
తమ ఏకాంతానికి అడ్డుగా ఉన్నారని పిల్లలను వదిలించుకోవాలని లక్ష్మి, ఆటో డ్రైవర్ భగత్ సింగ్ నగర్ లోని వారి ఇంట్లోనే ఐదేళ్ల కుమారుడు నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని, పదేళ్ల కుమారుడు అడ్డుకున్నాడని అతను చెప్పిన మాటలు వల్ల అర్థం చేసుకున్నారు. ఇక ఆ మరుసటి రోజు వారిని యాదాద్రిలో వదిలిపెట్టి వెళ్ళినట్టు చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నవ మాసాలు మోసి, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలను వివాహేతర సంబంధం కోసం ఓ తల్లి నడి వీధి పాలు చేయడం దారుణం కాగా, వారిని చంపాలని ప్రయత్నించడం అత్యంత హేయం. ఇలాంటి మహిళలు మహిళా లోకానికి మాయని మచ్చ.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications