ఆశలను చిదిమేసిన విద్యుత్ ఘాతం: నవ వధువు మృతి
హైదరాబాద్: కొత్త ఆశలు, ఎన్నో ఊసులతో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆ యువతిని విద్యుత్ ఘాతం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన శేరిలింగంపల్లి తారానగర్‌లో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... నారాయణఖేడ్ సుకిల్‌ధర్ గ్రామానికి చెందిన పండరీనాథ్ కుమార్తె భానుప్రియ(21) అలియాస్ సర్యాబాయికి తారానగర్‌కు చెందిన శ్రీనివాస్‌కు 45రోజుల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ నల్లగండ్ల కూరగాయల మార్కెట్‌లో పని చేస్తుంటాడు.

కాగా, భానుప్రియ గురువారం ఉదయం ఇంటిలో నీళ్లు పట్టుకుందాని నల్లా తిప్పగా విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే కుటుంబీకులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పాత భవనం కావడంతో విద్యుత్తు తీగలు షార్ట్ సర్క్యూట్ జరిగి నల్లాకు కరెంటు సరఫరా అయి చనిపోయి ఉంటుందని కుటుంబీకులు తెలిపారు. నవ వధువు మృతి చెందడంతో అటు పుట్టింటో, ఇటు అత్తారింట్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications