రాజాసింగ్‌కు పదేళ్లుగా బెదిరింపులు: ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చంపేస్తామంటూ గతంలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఓ ఆగాంతకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు రాజాసింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దుండగుడి ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ వసీం (40) దుబాయ్ నుంచి ఈ కాల్ చేసినట్లు గుర్తించారు.
అతడిపై ఐపీసీ 506, 507 సెక్షన్ లపై కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

దీంతో దుబాయ్ నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన నిందితుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు కస్టడీలోకి తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితుడు గత పదేళ్లుగా రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, రాజాసింగ్ ను చంపేస్తానని బెదిరించడం, ఇలా ఒక్క నెంబర్‌తో కాకుండా వేరే వేరే నెంబర్లతో బెదిరించేవాడు. దీనిపై రాజా సింగ్ తెలంగాణ సీఎం కు లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, సీఎం స్పందించాలని కోరారు. తన ప్రాణానికి ప్రాణహాని ఉందని, త్వరలో నిందితున్ని పట్టుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో అలర్ట్ అయిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నెంబర్ సహాయంతో ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ఆరా తీసారు. ఈ నెంబర్లు మొత్తం దుబాయ్ నుంచి వస్తున్నాయని గ్రహించారు. దీంతో ఈ నెంబర్లతో ఆరాతీయగా దుబాయ్ నుంచి బెదిరింపునకు పాల్పడిన నెంబర్లు మహమ్మద్ వసీం ఖాతా నుంచేనని గుర్తించారు.












Click it and Unblock the Notifications