కొత్తగా కంపెనీకి వచ్చిన అమ్మాయికి ఏజీఎం వేధింపులు: ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కొత్త ఉద్యోగంలో జాయినై విధులు నిర్వహిస్తున్న అమ్మాయిపై ఆ కంపెనీ ఏజీఎం లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులు భరించలేక ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన నగరంలోని మాదాపూర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని ఒక హాస్టల్ లో ఉంటున్న యువతి, వారం రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్డునెం-2లో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరింది.
ఆ కంపెనీలో ఏజీఎంగా ఢిల్లీకి చెందిన అశితోష్ వ్యవహరిస్తున్నాడు.

కాగా, యువతి విధుల్లో జాయినైనప్పటి నుంచి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, మానసికంగా, లైంగిక వేధింపులకు దిగుతున్నాడు అశితోష్. అతనికి మరో సహోద్యోగి గణేష్ సహకరిస్తూ, యువతిని వేధిస్తున్నాడు.
ఈ వేధింపులు భరించలేకపోయిన ఆ యువతి, హాస్టల్ కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన సహచరులు దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి విచారించగా, వేధింపుల పర్వం వెలుగు చూసింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు షీటీమ్స్ ను ఆశ్రయించారు. షీటీమ్స్ అశితోష్, గణేష్‌లను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి, విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications