విషాదం: టెట్ పరీక్ష కేంద్రంలో కుప్పకూలిన గర్భిణి, కాసేపటికే మృతి

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ టెట్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) జరుగుతున్న విషయం తెలిసిందే. టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన రాధిక అనే గర్భిణి మృతి చెందింది. ఇస్నాపూర్‌లో పరీక్ష రాసేందుకు వచ్చిన ఎనిమిది నెలల గర్భిణి రాధిక.. సమయంలో కావడంతో పరీక్ష కేంద్రానికి వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లింది.

ఈ క్రమంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్న కాసేపటికే బీపీ ఎక్కువ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే గమనించిన ఇన్విజిలేటర్.. ఇతర సిబ్బంది ఆమె కుటుంబానికి సమాచారం అందించారు. రాధికతోపాటు వచ్చిన ఆమె భర్త అరుణ్‌కు సమాచారం అందించడంతో.. ఆయన వెంటనే ఆమెను పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

A pregnant woman dies in tet exam hall in sangareddy district, due to high BP.

రాధిక మరణంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎనిమిది నెలల గర్భిణి అయినా.. రాత్రింబవళ్లు ఈ పరీక్ష కోసం చాలా కష్టపడి చదివిందని.. తీరా పరీక్ష రాయడానికి వస్తే ఏకంగా ప్రాణాలే పోయాంటూ భర్త అరుణ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆస్పత్రికి తీసుకువస్తుంటే.. రాధిక ముక్కు నుంచి రక్తం కారిందని.. చాలా సీరియస్ అవుతుందని అనుకున్నా.. కానీ ప్రాణాలే పోతాయని ఊహించలేదని రోదించారు. ఇప్పుడు తన బిడ్డలు తల్లిలేని వారయ్యారంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. రాధిక-అరుణ్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కాగా, రాధికకు బీపీ ఉందని.. ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకున్నప్పుడు తనకు బీపీ ఉందని వైద్యులు తెలిపారు. తను గత మూడు వారాల నుంచి బీపీ ట్యాబ్లెట్లు వాడుతోంది. శుక్రవారం ఒక్కసారిగా పరీక్ష కేంద్రంలో పడిపోయింది. అక్కడ్నుంచి ఆస్పత్రికి తీసుకువచ్చేసరికి తన పల్స్ పడిపోయింది. ఆమెకు గుండెపోటు వచ్చి ఉంటుందని భావిస్తున్నామని డాక్టర్ ప్రియదర్శిని తెలిపారు.

మరోవైపు, శుక్రవారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పేపర్-1కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేయగా.. 1139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ టూ 2 లక్షల 8 వేల 498 రాయనుండగా.. 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగ్జామ్ హాల్​లోకి అనుమతించలేదు. సెప్టెంబర్ 27వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడించనున్నట్లు నోటిఫికేషన్​లో ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+