నెత్తురోడిన జడ్చర్ల రహదారి: లారీని 'ఢీ'కొట్టిన బస్సు.. డ్రైవర్, క్లీనర్ మృతి

జడ్చర్ల రహదారిపై ఓ ప్రైవేటు బస్సు ఆగివున్న లారీని వెనకనుంచి ఢీ కొట్టడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు అక్కడిక్కడే మరణించారు.

జడ్చర్ల : ఉదయం 8.10గం.లకు జడ్చర్ల రహదారిపై ఓ ప్రైవేటు బస్సు ఆగివున్న లారీని వెనకనుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు అక్కడిక్కడే మరణించగా.. బస్సులో ఉన్న 20మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.

A private travels bus met with accident at Jadcharla highway

మొత్తం 36మంది విద్యార్థులతో బస్సు కేరళ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, రహదారికి అడ్డుగా వచ్చిన ఓ వృద్దురాలిని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మిగతా విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని, ఘటనపై విచారణ జరుపుతామని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+