కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే స్కీమ్ త్వరలో!

తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ అలియాస్ సీతక్క వెల్లడించారు ఇందిరా మహిళా శక్తి పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించిన మంత్రి డిసెంబర్ మొదటి వారంలో ఇందిర మహిళా శక్తి పథకానికి సంబంధించి వారోత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని స్వయం సహాయక గ్రూపుల సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలోని మహిళలందరూ స్వయం సహాయక సంఘాలలో చేరేలా అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం కోసం గ్రామ గ్రామీణ బ్యాంకర్లతో సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు.

A scheme to make millions of women millionaires soon Indira mahila shakti scheme soon

10 లక్షల వరకు బ్యాంకు రుణాలు
తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా ఇందిర మహిళా శక్తి పథకానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ రూపకల్పన చేసింది. త్వరలోనే ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమల్లో అవసరమైన ఉత్పత్తులను తయారు చేయించి, వారికి ప్రోత్సాహం అందించడానికి కంకణం కట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా పది లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది.

మహిళలకు సువర్ణావకాశం
ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ప్రభుత్వం అద్భుతమైన వరాన్ని అందించింది. ఈ పథకం ద్వారా ఇంట్లో ఉండి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. స్వయం ఉపాధిని పొందవచ్చు. ఈ పథకం ద్వారా స్టార్టప్ కంపెనీలు, బిజినెస్ లు మహిళలు నిర్వహించవచ్చు. ఇక ఒంటరిగా వ్యాపారాలు చేయలేని మహిళలు గ్రూపులుగా కూడా వ్యాపారాలు చేయవచ్చు.

అర్బన్ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలించడమే లక్ష్యం
మహిళలు బ్యాంకుల నుండి ఈ పథకంలో అవసరాన్ని బట్టి లోన్ తీసుకుంటారు. 10 లక్షల రూపాయల వరకు రుణాలను బ్యాంకర్లు ఈ పథకం ద్వారా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు ఇస్తారు. అర్బన్ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలించడానికి మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి ఇందిరా మహిళా శక్తి పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+