ఖమ్మం టీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు.. కాంగ్రెస్ లోకి మాజీఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు!!

తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నా యి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి కుమార్తె, కార్పొరేటర్ విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో కీలక నేత కారు దిగేందుకు రెడీ అయినట్టు సమాచారం.

నేడు గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు

నేడు గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు

గత కొంతకాలంగా ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ లో సరైన గుర్తింపు లేదని, అధిష్టానం స్పందించకపోతే పార్టీని వీడుతానని తేల్చి చెప్పారు. ఇక తాజాగా ఆయన కారు దిగి హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అయినట్టు అందుకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. నేడు తాటి వెంకటేశ్వర్లు హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

కేసీఆర్ సర్కార్ పై ధిక్కార స్వరం వినిపించిన తాటి వెంకటేశ్వర్లు

కేసీఆర్ సర్కార్ పై ధిక్కార స్వరం వినిపించిన తాటి వెంకటేశ్వర్లు

ఈ క్రమంలో ఇప్పటికే తాటి వెంకటేశ్వర్లు ప్రధాన అనుచరులు హైదరాబాద్ కు చేరుకుని హడావిడి చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసహనం తో ఉన్న తాటి వెంకటేశ్వర్లు పార్టీలో తాను అనేక అవమానాలను ఎదుర్కొంటున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పార్టీ ఫ్లెక్సీలలో కూడా తన ఫోటో వేయడం లేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తుమ్మల నాగేశ్వర రావు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటే సీనియర్ నాయకుడిని అని చెప్పుకున్న ఆయన తన ధిక్కార స్వరం వినిపించారు.

కాంగ్రెస్ తెలంగాణా బాస్ రేవంత్ రెడ్డి, జానారెడ్డిలతో భేటీ.. నేడే కాంగ్రెస్ లో చేరిక

కాంగ్రెస్ తెలంగాణా బాస్ రేవంత్ రెడ్డి, జానారెడ్డిలతో భేటీ.. నేడే కాంగ్రెస్ లో చేరిక

గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి, టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అశ్వారావుపేట పేట నియోజకవర్గంలో ప్రజలలో తాటి వెంకటేశ్వర్లు కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి తాటి వెంకటేశ్వర్లు గుడ్ బై చెప్పడం గులాబీ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే ఖమ్మంలో గులాబీ పార్టీని బలోపేతం చెయ్యాలని ప్రయత్నాలు చేస్తుంటే అవి ఫలించకపోగా వరుస షాక్ లు తగులుతున్నాయి.

ఖమ్మం జిల్లాలో వరుసగా రెండో వికెట్ .. గులాబీ పార్టీకి షాక్

ఖమ్మం జిల్లాలో వరుసగా రెండో వికెట్ .. గులాబీ పార్టీకి షాక్

ఇప్పటికే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, ఇక తాజాగా తాటి వెంకటేశ్వర్లు కూడా కాంగ్రెస్ బాట పట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో వరుసగా రెండో వికెట్ పడిపోయిందని తెలుస్తుంది. ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న అసమ్మతి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులతో బయటకు వస్తూ ఉండడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. గులాబీ పార్టీకి షాక్ అని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+