బీఆర్ఎస్ కు షాక్.. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ఉన్న ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్ పైన విచారణ జరిపిన ధర్మాసనం సీఎం రేవంత్ రెడ్డి కి భారీ ఊరటను ఇచ్చింది.

రేవంత్ టార్గెట్ గా సుప్రీం మెట్లెక్కిన జగదీశ్ రెడ్డి
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయటం కోసం ఆయుధాలను వెతుకుతూనే ఉంది. ఇదే క్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని టార్గెట్ చేసి సుప్రీం మెట్లెక్కి సుప్రీం ధర్మాసనం ముందు ఓటుకు నోటు కేసు ట్రాన్స్ఫర్ పిటీషన్ పెట్టారు.

A shock to BRS Big relief for CM Revanth Reddy in the money for vote case in supreme court

సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు
ఇందులో రేవంత్ రెడ్డి కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చెయ్యాలని కోరారు. ఈరోజు జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ కె.వి విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం జగదీశ్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్ పైన విచారణ జరిపింది. ఈ విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనే విషయం కేవలం అపోహ మాత్రమేనని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

ఆధారాలు లేని ఆరోపణలు.. మీ అభ్యర్ధన కుదరదు
ఇది ఊహాజనితమైన పిటిషన్ అని ఈ పిటిషన్ ను ఎంటర్టైన్ చేయలేమని పేర్కొంది. రేవంత్ రెడ్డి విచారణ ప్రభావితం చేసే స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు విచారణలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని ఒకవేళ రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది.

రేవంత్ రెడ్డి కేసుపై కీలక విషయాలు ప్రస్తావించిన సుప్రీం ధర్మాసనం
దర్యాప్తు విషయంలో సీఎంకు, హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టు కూడా ఈ విచారణను చాలా పారదర్శకంగా చేపట్టాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా సుప్రీం ధర్మాసనం ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఆచితూచి మాట్లాడాలని పేర్కొని తాను చేసిన వ్యాఖ్యల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలను ధర్మాసనం అంగీకరించింది.మొత్తంగా ఈ వ్యవహారంలో కోర్టు నిర్ణయంతో బిఆర్ఎస్ మాజీమంత్రి జగదీశ్ రెడ్డి కి షాక్ తగలగా, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికినట్టు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+